గాసిప్స్ న్యూస్

అక్కడ 65 కోట్ల బ్లాక్ బస్టర్….ఇప్పుడు బెల్లంకొండ చేతిలో రీమేక్…ఏమవుతుందో ఇక!

టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్, రాక్షసుడు సినిమా తో కెరీర్ లో మొదటి విజయాన్ని నమోదు చేసిన బెల్లంకొండ తర్వాత మళ్ళీ అల్లుడు అదుర్స్ సినిమా తో డిసాస్టర్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా తర్వాత ఇక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ఇప్పుడు ప్రభాస్ చేసిన ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ లెవల్ లో రూపొందుతున్న…

ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మరో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, కానీ ఈసారి హిందీ లో కాకుండా తెలుగు లో ఈ రీమేక్ ఉంటుందని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ గట్టిగా వినిపిస్తుంది. నటన పరంగా కొంచం వీక్ అన్న…

విమర్శలు ఉన్న బెల్లంకొండ ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కర్ణన్ తెలుగు రీమేక్ లో నటించడానికి ఎక్కువ ఆసక్తి ని చూపుతున్నారని లేటెస్ట్ గా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలో అద్బుత నటనతో దుమ్ము లేపాడు ధనుష్, దాంతో పాటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50% లిమిటేషన్స్ తో కూడా ఓ రేంజ్ లో దుమ్ము లేపి మొత్తం మీద ఇప్పటి వరకు 65 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ధనుష్ కెరీర్ లోనే నంబర్ 1 మూవీ గా నిలిచింది, దాంతో సినిమా తెలుగు రీమేక్ పై ఆసక్తి పెరిగి పోగా…

ముందు తెలుగు లో డబ్ చేయాలి అనుకున్నారు కానీ రీమేక్ కోసం ఆఫర్స్ బాగా వస్తున్నాయని అందుకనే ఇప్పుడు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, బెల్లంకొండ రేసులో ముందు నిలిచే హీరో అని అంటున్నారు. మరి ఇది నిజం అయితే ధనుష్ రోల్ కి బెల్లంకొండ ఎంతవరకు న్యాయం చేస్తాడు అన్నది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

Leave a Comment