న్యూస్ బాక్స్ ఆఫీస్

అక్షరాలా…..2220 కోట్లు…ఇదెక్కడి మాస్ రా బాబు!!

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ మనకు ఇంకా పూర్తిగా సెట్ కాలేదు కానీ ఓవర్సీస్ మార్కెట్ చాలా వరకు స్టేబుల్ అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో మళ్ళీ వారం వారం వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండగా మునుపటి రేంజ్ లో కాకున్నా కానీ చాలా వరకు బెటర్ కలెక్షన్స్ ని సినిమాను సొంతం చేసుకుంటున్నాయి. మార్వెల్ నుండి లేటెస్ట్ గా వచ్చిన కొత్త సూపర్ హీరో మూవీ షాంగ్ చీ…

బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ దూసుకు పోతుంది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 20 రోజులు కావస్తూ ఉండగా సినిమా అమెరికాలో ఏకంగా 177 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసి దుమ్ము లేపిందట.

అంటే ఇండియన్ కరెన్సీ లో 1310 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అక్కడ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లైఫ్ టైం కలెక్షన్స్ 173 మిలియన్స్ ని క్రాస్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఏకంగా 300 మిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుందట.

అంటే ఇండియన్ కరెన్సీ లో ఆల్ మోస్ట్ 2220 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇంకా అతి పెద్ద మార్కెట్ అయిన చైనా లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా అక్కడ వీర లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నారు. ఇక సినిమా ఇండియా లో 20 రోజులు పూర్తీ అయ్యే టైం కి అన్ని చోట్లా కలుపుకుని 24 కోట్ల మేర…

నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇది ఓవరాల్ గా ఓ హాలీవుడ్ మూవీ కి ఇండియా లో సెన్సేషనల్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా ఇండియా లో కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇక ఫైనల్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకుంటుందో చూడాలి.

Leave a Comment