గాసిప్స్ న్యూస్

అక్షరాలా 25 కోట్లు…సాయి ధరం తేజ్ ఏం చేస్తాడో మరి!!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఎదురుకున్న వరుస ఫ్లాఫ్స్ తర్వాత లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు బాక్ టు బాక్ హిట్స్ తో మంచి కంబ్యాక్ చేశాడు. చిత్రలహరి సూపర్ హిట్ గా నిలిస్తే… ప్రతీ రోజూ పండగే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు హాట్రిక్ కొట్టడానికి సోలో బ్రతుకే సో బెటర్…

సినిమా తో ఆడియన్స్ ముందుకు వద్దామని అనుకున్నా కానీ కరోనా ఎఫెక్ట్ తో సినిమా నిరవధికంగా ఆగిపోగా… సినిమా కి ఇప్పుడు డైరక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఇది వరకు 18 కోట్ల ఆఫర్ రాగా, తర్వాత రీసెంట్ గా ఏకంగా 24 కోట్ల…

రేంజ్ లో ఆఫర్ ఈ సినిమా కి దక్కగా టీం నుండి ఎలాంటి వార్తా లేదు, ఇక ఇప్పుడు లీడింగ్ స్ట్రీమింగ్ యాప్ అయిన అమెజాన ప్రైమ్ ఈ సినిమా కోసం మరో కోటి పెంచి మొత్తం మీద 25 కోట్ల ఆఫర్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

సాయి ధరం తేజ్ కెరీర్ లో ఇంటెలిజెంట్ మూవీ తర్వాత ఇదే బిగ్గెస్ట్ బిజినెస్ రేటు అని చెప్పాలి. లేటెస్ట్ గా తన కెరీర్ బెస్ట్ హిట్ ని కొట్టిన సాయి ధరం తేజ్ ఇప్పుడు ఈ సినిమా ఆఫర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది ఆసక్తి కరంగా మారగా ఆఫర్ మాత్రం టెంప్ట్ అయ్యేలానే ఉందని చెప్పాలి.

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే తెలుగు లో డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలు అన్నీ చిన్నవే కావడం తో ఒక్కటైనా మీడియం టు హై మూవీ ని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలని అన్ని యాప్స్ తెగ కష్టపడుతున్నాయి కానీ మన హీరోలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు. మరి ఇప్పుడు సాయి ధరం తేజ్ ఫైనల్ ఆన్సర్ ఏమని చెబుతాడో చూడాలి మరి…

Leave a Comment