న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

అక్షరాలా 250 కోట్లు…చరిత్రకెక్కిన స్టైలిష్ స్టార్ భీభత్సం!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి అంచనాలకు కూడా అందని విజయాన్ని సొంతం చేసుకుంది, సరైన హిట్ కోసం ఎదురు చూపులు, పోటి లో హిట్స్ లో ఉన్న హీరో సినిమా తో పోటి, ఫస్ట్ డే సరిపడినన్ని థియేటర్స్ కూడా లేవు. అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అల వైకుంఠ పురం లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

ఫస్ట్ డే తప్పితే మిగిలిన అన్ని రోజుల్లో ప్రతీ రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డులే కాకుండా కొన్ని రోజుల్లో ఏకంగా బాహుబలి రికార్డ్ లను కూడా బ్రేక్ చేస్తూ సాగిన అల వైకుంఠ పురం లో ప్రయాణం మొత్తం మీద రీసెంట్ గా 25 రోజులను పూర్తీ చేసుకుంది.

కాగా సినిమా టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో 150 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరింది. మిగిలినవన్నీ పాన్ ఇండియా మూవీస్ కాగా ఈ సినిమా కేవలం తెలుగు కే రికార్డులు తిరగరాసింది.

ఇక సినిమా మొత్తం మీద సాధించిన గ్రాస్ కలెక్షన్స్ రీసెంట్ గా సెన్సేషనల్ 250 కోట్ల మార్క్ ని దాటాయి. పోటి లో కూడా ఈ రేంజ్ లో సినిమా కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు అచీవ్ మెంట్ కాదనే చెప్పాలి. చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ లేకుండానే…

ఇలాంటి సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ మంచి వసూళ్ళనే సాధిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మొత్తం మీద 160 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Comment