గాసిప్స్ న్యూస్

అక్షరాలా 250 కోట్ల సినిమా…ఫ్యాన్స్ దెబ్బకి ఆపేసిన కరణ్ జోహార్

ఫస్ట్ వేవ్ తర్వాత సుశాంత్ మరణం, తర్వాత సెకెండ్ వేవ్… బాలీవుడ్ ఏమాత్రం తేరుకోలేక పోతుంది ఇప్పటి వరకు… ఏడాది నుండి అనేక సినిమాలు అనేక రకాల ఇబ్బందులను ఎదురు కుంటూనే వస్తున్నాయి. టీసర్ లు ట్రైలర్ లకు డిస్ లైక్స్ వర్షం కురిసింది… దానికి కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్. తనకి జరిగిన అన్యాయానికి కచ్చితంగా న్యాయం చేసి తీరాల్సిందే అంటూ సోషల్ మీడియా లో ప్రతీ రోజూ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ అందరూ ఎదో ఒక ట్రెండ్ చేస్తూనే ఉండగా బాలీవుడ్ వాళ్ళు ముందు లైట్ తీసుకున్నారు…

ఏడాది నుండి కొనసాగుతున్న పోరాటానికి ఇప్పటికీ కూడా ఆన్సర్ దొరకలేదు ఎవ్వరికీ… ఈ టైం లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన సడక్ 2, లక్ష్మీ, కూలీ నంబర్ 1, ఖాళీ పీలి ఇలా అనేక సినిమాల రిజల్ట్ చూసి తమ సినిమాలను కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అన్న డౌట్ తో కొందరు సుశాంత్ పై మౌనాన్ని వీడి తనకి న్యాయం జరగాలి అని పోస్ట్స్ పెట్టారు.

ఇక ఫ్యాన్స్ మరో బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిన నేపోటిజం మీద మాత్రం…అసలు తగ్గేది లేదూ అన్నట్లు ప్రతీ సినిమా పై ఇలాంటి యుద్దమే తమకి తోచిన విధంగా చేయాలి అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్. దాంతో అందరి కన్నా ఎక్కువ ఇబ్బంది కరణ్ జోహార్ మీద పడింది, ఎక్కువ శాతం స్టార్స్ తోనే సినిమాలు తీసే కరణ్ జోహార్..

లాస్ట్ ఇయర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల రేంజ్ బడ్జెట్ తో…. దాదాపు స్టార్ కిడ్స్ తో తెరకెక్కిస్తున్న తక్త్ అనే సినిమా ను ఆపేసినట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది, రణవీర్ సింగ్, ఆలియా భట్, కరీనా కపూర్, విక్కీ కౌశల్, భూమీ పడ్నేకర్, జాన్వి కపూర్ మరియు అనిల్ కపూర్ తో ప్లాన్ చేసిన ఈ భారీ సినిమాను ఆపినట్లే ఆపి…

తిరిగి మొదలు పెట్టాలని ట్రై చేసినా కానీ సుశాంత్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం తో ఇంత బడ్జెట్ తో రిస్క్ చేయడం అవసరం లేదు అనుకున్న కరణ్ జోహార్ సినిమానే ఆపేశారట. ఈ విషయాన్ని రీసెంట్ గా అఫీషియల్ గానే కన్ఫాం చేశారట కరణ్ జోహార్… దాంతో ఫ్యాన్స్ దెబ్బకి ప్రొడ్యూసర్ భయపడి ఏకంగా 250 కోట్ల రేంజ్ బిగ్ మూవీ ని కంప్లీట్ గా కాన్సిల్ చేస్తున్నామని చెప్పినట్లు అయింది.

Leave a Comment