న్యూస్ బాక్స్ ఆఫీస్

అక్షరాలా 32 కోట్లు…అరాచకం అసలు!!

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 13.5 కోట్ల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మరో సారి అల్టిమేట్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మూడో రోజు 4 కోట్లకు ఏమాత్రం తగ్గని కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 కోట్లకు ఏమాత్రం తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు షేర్ 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ 9 కోట్ల కి ఏమాత్రం తగ్గని విధంగా ఉండే అవకాశం ఉండగా మూడు రోజుల టోటల్ గ్రాస్ లెక్కలు ఇప్పుడు 30 కోట్ల మార్క్ ని అధిగమించి 32 కోట్ల ని చేరుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఇవి సెన్సేషనల్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. ఈ ఇయర్ సంక్రాంతి మూవీస్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఈ రేంజ్ లో ఊచకోత కోసిన సినిమా భీష్మ నే అవ్వడం విశేషం అనే చెప్పాలి. దాంతో ఇప్పుడు ఓవరాల్ గా మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఇప్పుడు…

మినిమమ్ 18.5 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు, వరల్డ్ వైడ్ గ్రాస్ 32 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, ఇక వర్కింగ్ డేస్ లో మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అయినా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. ఇక 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎ విధంగా ఉంటాయో చూడాలి.

Leave a Comment