గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

అక్షరాలా 53 కోట్ల ప్రాఫిట్…65 కోట్ల డీల్…వాళ్లకి తీవ్ర కోపం!!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త సినిమా లు రిలీజ్ అయ్యి జనాలు థియేటర్స్ కి భారీ సంఖ్య లో వచ్చి ఆ సినిమా లు లాంగ్ రన్ ని సొంతం చేసుకుని భారీ లాభాలు ఆర్జించడం అనేది ఊహనే అని చెప్పుకోవాలి. ఇదే సమయం లో కోట్లు కోట్లు పెట్టి సినిమా లు తీసిన నిర్మాతలు తమ సినిమాలు థియేటర్స్ లో నే రిలీజ్ అవ్వాలి అని కోరుకున్నా కానీ పెట్టిన డబ్బు…

కూడా రికవరీ అవ్వాలి అని ఆశిస్తారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో థియేట్రికల్ రిలీజ్ లు కష్టం కాబట్టి డిజిటల్ రిలీజ్ కి సిద్ధ పడుతూ బెటర్ ఆఫర్ ఏ OTT యాప్ ఇస్తే ఆ యాప్ కి స్ట్రీమింగ్ రైట్స్ ని అమ్ముకుంటున్నారు. దాంతో థియేటర్ ఓనర్లు నిర్మాతలపై మండిపడుతున్నారు.

లేటెస్ట్ గా బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరియు అమితాబ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “గులాబో సితాబో” సినిమా కి ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ అవుతున్నా ప్రాఫిట్స్ సాలిడ్ గా దక్కాయి అని చెబుతున్నారు..

సినిమా ను 35 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా… శాటిలైట్ రైట్స్ కింద  15.4 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద 7.5 కోట్లు ఇది వరకే సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక లేటెస్ట్ గా డిజిటల్ రైట్స్ కింద సినిమాకి ఏకంగా 65 కోట్ల రేటు దక్కింది, దాంతో ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే… 87 కోట్ల రేంజ్ లో బిజినెస్ దక్కింది.

సినిమా బడ్జెట్ 35 కోట్లు పక్కకు పెడితే ఈ సినిమా వలన నిర్మాతకి ఏకంగా 53 కోట్ల ప్రాఫిట్ థియేటర్స్ లో రిలీజ్ చేయకుండానే దక్కింది, దాంతో థియేటర్ ఓనర్లు…  కలెక్షన్స్ రూపంలో రావాల్సిన లాభాలు OTT యాప్స్ ద్వారా నిర్మాతలు తీసుకుంటున్నారని, ఇలా చేస్తే జనాలు ఇక థియేటర్స్ రారని గగ్గోలు పెడుతున్నారు. నిర్మాతలు మాత్రం మాకు నష్టం వచ్చినప్పుడు మీరు మీ జేబు ల నుండి తీసి ఇచ్చారా. ఇప్పుడు లాభం వస్తే ఎందుకు అడుగుతున్నారని అంటున్నారు…

Leave a Comment