న్యూస్

అఖండ 16డేస్….పుష్ప 20 డేస్….రాధేశ్యామ్ మెంటల్ మాస్ టాలీవుడ్ బిగ్గెస్ట్ రికార్డ్!!

ఇది వరకు టాలీవుడ్ టీసర్ ల విషయంలో కానీ ట్రైలర్ ల విషయంలో కానీ కొత్త రికార్డులు నమోదు అవ్వాలి అంటే చాలా టైం పట్టేది. మొదటి రోజు 10 మిలియన్స్ ని అందుకోవడానికి కూడా కష్టపడేవాళ్ళు కానీ రాను రాను మొదటి రోజే అల్టిమేట్ వ్యూస్ ని సొంతం చేసుకోవడమే కాదు లాంగ్ రన్ లో కూడా అవలీలగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుంటూ దుమ్ము లేపడం స్టార్ట్ చేశాయి…

టాలీవుడ్ లో ఫస్ట్ 50 మిలియన్ వ్యూస్ టీసర్ గా ఆర్ ఆర్ ఆర్ లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ నిలవగా తర్వాత తక్కువ టైం లోనే ఈ మార్క్ ని అందుకున్న టీసర్ గా పుష్ప టీసర్ 20 రోజుల్లో ఈ రికార్డ్ బ్రేకింగ్ బెంచ్ మార్క్ ని అందుకుంది. ఆ రికార్డ్ ను…

బాలయ్య నటించిన అఖండ టీసర్ 16 రోజుల టైం మాత్రమే తీసుకుని బ్రేక్ చేసింది… ఈ రెండు టీసర్లు రోజుల టైం తీసుకుంటే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్ కేవలం రోజు కి పైగా టైం మాత్రమె తీసుకుని ఈ రికార్డ్ ను అందుకుంది…

మొత్తం మీద 50 మిలియన్స్ బెంచ్ మార్క్ ని అందుకోవడానికి రాధే శ్యామ్ టీసర్ కి కేవలం 25 గంటల 38 నిమిషాల టైం మాత్రమె సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి.. దాంతో టాలీవుడ్ లోనే సరికొత్త రికార్డ్ ను నమోదు చేసిన రాధే శ్యామ్ టీసర్ ఇండియాలో కూడా KGF చాప్టర్ 2 టీసర్ తర్వాత సెకెండ్ ఫాస్టెస్ట్ 50M వ్యూస్ ని…

అందుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, 50M అందుకోవడానికి KGF చాప్టర్ 2 కి కేవలం 17 గంటలకు పైగా టైం మాత్రమె పట్టింది… ఓవరాల్ గా ఇండియాలో టాప్ 2 ఫాస్టెస్ట్ 50M వ్యూస్ రికార్డ్ ను అలాగే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి రాధే శ్యామ్ సంచలనం సృష్టించింది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a Comment