న్యూస్

అఖిల్ 4…కన్ఫాం చేసిన టాప్ ప్రొడక్షన్ హౌస్!!

అక్కినేని అఖిల్ తొలి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు, ఇలాంటి సమయం లో తన నాలుగో సినిమా ఎవరి తో చేస్తాడు అన్న ఆసక్తి ఎక్కువగా ఉండగా ఎట్టకేలకు చాలా రోజుల వెయిట్ తర్వాత అఖిల్…

4 వ సినిమా అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన గీత ఆర్ట్స్ లో అఖిల్ 4 వ సినిమా కన్ఫాం అయ్యింది. ఈ సినిమా అప్ డేట్ ని అఫీషియల్ గా ట్విట్టర్ లో తెలియజేశారు గీత ఆర్ట్స్ వారు.

అఖిల్ 4 వ సినిమా కి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకేక్కుతుందని సమాచారం. మరి ఈ సినిమా తో అయినా అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!