గాసిప్స్ న్యూస్

అదిరి పోయే టైటిల్ తో రవితేజ సినిమా…సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలానికి ఈ ఇయర్ లో నికార్సయిన హిట్ కొట్టి జోరు మీదున్నాడు, కెరీర్ లో ఆల్ మోస్ట్ 4 ఏళ్ళుగా హిట్ కి దూరం అయిన రవితేజ బాక్ టు బాక్ 4 డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకోవాల్సి రాగా ఎట్టకేలకు క్రాక్ సినిమా సంక్రాంతి బరిలో 50% ఆక్యుపెన్సీ తో కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత ఇప్పుడు రవితేజ ఖిలాడి సినిమాతో ఆడియన్స్ ముందుకు అతి త్వరలో రాబోతున్న రవితేజ ఈ సినిమాను ఆల్ మోస్ట్ ముగించడం తో ఇప్పుడు కొత్త సినిమాను మొదలు పెట్టాడు, కొత్త డైరెక్టర్ శరత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలు అవ్వగా…

సినిమా టైటిల్ ని అలాగే ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఎక్స్ పెరి మెంటల్ మూవీ గా 1990 టైం లో పక్కా రాయలసీమ యాసతో ఈ సినిమా లో రవితేజ నటిస్తారని సమాచారం. ఇక సినిమా కి టైటిల్ గా “రామారావు ఆన్ డ్యూటీ” అంటూ…

చాలా కొత్త అండ్ డిఫెరెంట్ టైటిల్ ని సినిమా కి పెట్టారు. ఈ టైటిల్ తోనే సినిమా పై ఆసక్తి మరింతగా పెరిగి పోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం మొత్తం మీద 30 రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చిన రవితేజ భారీ రెమ్యునరేషన్ ని కూడా తీసుకోబోతుండగా సినిమా బడ్జెట్ కూడా 35 కోట్లకు పైగానే పెట్టి ఈ సినిమాను…

నిర్మిస్తున్నారని తెలుస్తుంది. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ లెవల్ లోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ లోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇది జరిగితే 3 సినిమాలతో ఈ ఇయర్ రవితేజ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment