గాసిప్స్ న్యూస్

అది నచ్చక…కొత్తది ట్రై చేస్తున్న అల్లు అర్జున్!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠ పురం లో ఇండస్ట్రీ హిట్ తో ఊరమాస్ ఊపుతో ఉన్నాడు, సంక్రాంతి రేసు లో పోటి లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న పుష్ప అన్న విషయం అందరికీ తెలిసిందే. రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్…

సరికొత్త కథ తో రూపొందిస్తున్న ఈ సినిమా లో అల్లు అర్జున్ చాలా డిఫెరెంట్ రోల్ చేయబోతున్నాడట, అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కూడా డిఫెరెంట్ గా ఉండగా అందులో అల్లు అర్జున్ లుక్ కూడా కొత్తగా ఉందని మెచ్చుకున్నారు అందరూ…

కానీ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా లో తన లుక్ అంత భాగా నచ్చలేదట అల్లు అర్జున్ కి, ఫస్ట్ లుక్ లో ఉన్న లుక్ ట్రైల్ లుక్ అని కూడా అంటున్నారు, అది అల్లు అర్జున్ కి పెర్ఫెక్ట్ గా అనిపించలేదని, దాంతో ఇప్పుడు అల్లు అర్జున్….

పుష్ప సినిమా కోసం మరో డిఫెరెంట్ లుక్ ని ట్రై చేస్తున్నాడని అంటున్నారు, ఆ లుక్ సెట్ అయితే సినిమా లో అదే లుక్ ని ఫాలో అవుతాడని అంటున్నారు, పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు.

నార్త్ సైడ్ అల్లు అర్జున్ మూవీస్ కి రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో వస్తూ ఉండటం తో ఈ సారి డైరెక్ట్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తో అక్కడ కూడా అల్లు అర్జున్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం….

Leave a Comment