న్యూస్

అదుగో….దొరసాని ఫస్ట్ టైం TRP రేటింగ్స్…రెండూ షాకింగే!!

వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండటం కొన్ని సినిమాలు ఇలా వేసినా కూడా జనాలు చూస్తూ ఉండటం తో రేటింగ్ లు వస్తున్నా కొత్త సినిమాలు కూడా టెలికాస్ట్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు తెలుగు ఛానెల్స్ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోని కొన్ని సినిమాలను ఎంతో కొంత రేటు చెల్లించి రైట్స్ ని సొంతం చేసుకుని టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తున్నాయి. లాస్ట్ వీక్ కూడా ఇదే ఫార్మాట్ లో…

2 సినిమాలు ఫస్ట్ టైం టెలికాస్ట్ అయ్యాయి, వాటిలో రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అదుగో సినిమా ఒకటి కాగా మరోటి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా లాంచ్ అయిన దొరసాని సినిమాలు. ఒకటి జెమినీ టీవీ లో మరోటి ఈ టీవీ లో….రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యాయి.

వాటిలో ముందుగా రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అదుగో సినిమా బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ కాగా ఈ టీవీ ఈ సినిమా కి 80 లక్షల రేంజ్ లో రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 3.4 రేటింగ్ ని సొంతం చేసుకుంది.

ఇక ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా హక్కులను సుమారు 1.1 కోట్ల రేటు కి జెమినీ టీవీ వారు సొంతం చేసుకోగా సినిమా టెలికాస్ట్ అయిన మొదటి సారి 2.4 రేటింగ్ ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక గమనించాల్సిన విషయం ఏంటి అంటే… ఎక్కువ వ్యూవర్ షిప్ ఉండే జెమినీ టీవీ లో… కొంచం బెటర్ నోటబుల్ మూవీ అయిన దొరసాని కన్నా కూడా…

సినిమాల పరంగా తక్కువ వ్యూవర్ షిప్ ఉండే ఈ టీవీ లో అసలు ఎవ్వరూ పట్టించుకోని అదుగో లాంటి సినిమాకి తక్కువ రేటుకే మరో సినిమా తో కంపేర్ చేస్తే బెటర్ రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా 2 సినిమాలు కూడా టెలివిజన్ లో జస్ట్ ఓకే అనిపించుకోగా అదుగో కొంచం బెటర్ అనిపించుకుంది.

Leave a Comment