గాసిప్స్ న్యూస్

అనుకున్నది 55…కానీ వచ్చింది ఇది…బిగ్గెస్ట్ రికార్డ్ ఇది!!

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర్ణన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గరే రిలీజ్ అవ్వాల్సిన ధనుష్ కొత్త సినిమా జగమే తంత్రం థియేటర్ రిలీజ్ ను పక్కకు పెట్టి సెకెండ్ వేవ్ కన్నా ముందే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను నెట్ ఫ్లిక్స్ లో కన్ఫాం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో అందుబాటు లోకి తీసుకు రాబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా విషయం లో ధనుష్ ముందు నుండి నిర్మాతలతో…

సినిమా డిజిటల్ రిలీజ్ వద్దని థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ చెబుతూనే ఉన్నప్పటికీ కూడా సినిమా డిజిటల్ రిలీజ్ నే సొంతం చేసుకోవడం కన్ఫాం అవ్వడం తో పెద్దగా ప్రమోషన్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గర పడటంతో లైట్ గా ప్రమోషన్ చేస్తున్నాడు…

ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి గాను ఇది వరకు ఏకంగా 55 కోట్ల రేటు ని సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అసలు రేటు ఎంత అనేది క్లియర్ అయింది. సినిమా కంప్లీట్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 60 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది ముందు అనుకున్న రేటు కన్నా కూడా 5 కోట్లు అధికం.

ఈ రేంజ్ రేటు సొంతం చేసుకోవడం తో కోలివుడ్ తరుపున ఆల్ టైం హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఇది వరకు సూర్య సూరరై పోట్రు కి 55 కోట్ల రేంజ్ రేటు సొంతం అవ్వగా ఇప్పుడు ఆ రేటు కన్నా ఎక్కువ రేటు సొంతం చేసుకుని కోలివుడ్ తరుపున రికార్డ్ కొట్టింది ఈ సినిమా.

Leave a Comment