టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి…రాధే టోటల్ OTT కలెక్షన్స్ ఇవే!

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదేమో కానీ అక్కడ కాకుండా డిజిటల్ రిలీజ్ లో పే పెర్ వ్యూస్ పద్దతి లో రిలీజ్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ గా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, అయినా కానీ పెయిడ్ వ్యూస్ పరంగా సంచలన రెస్పాన్స్ ను…

ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద సెన్సేషనల్ వ్యూస్ ని మొదటి రోజు దక్కించుకుని బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయగా మొత్తం మీద మొదటి వీకెండ్ తర్వాత కూడా రికార్డులను కంటిన్యూ చేస్తూ ఆ జోరు ని వర్కింగ్ డేస్ లో కొంచం తగ్గించినా…

మొదటి వారం ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉండగా సెకెండ్ వీకెండ్ తర్వాత సినిమా ను ఇప్పుడు డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో కాకుండా జీ 5 యాప్ లో అప్లోడ్ చేశారు. దాంతో సినిమా పే పెర్ వ్యూ పద్దతి లో రన్ కంప్లీట్ అవ్వగా సినిమా ఓవరాల్ గా….

వ్యూస్ లెక్కలు కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి అంటూ ట్రేడ్ లో లెక్కలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం….
ఫస్ట్ డే వ్యూస్ – 4.2 మిలియన్
వీకెండ్ వ్యూస్ – 7.6 మిలియన్
ఫస్ట్ వీక్ వ్యూస్ – 8.68 మిలియన్
11 డేస్ వ్యూస్ – 9.22 మిలియన్ వ్యూస్….
ఇందులో DTH ద్వారా ఓవరాల్ గా 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయట
అలాగే జీ నెట్ వర్క్ 499 ప్లాన్ లో 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయట…

DTH కి అలాగే నార్మల్ పే పెర్ వ్యూ పద్దతిలో టికెట్ రేటు 249 కాగా 499 రేటు కి వచ్చిన వ్యూస్ 1.8 మిలియన్ ని పక్కకు పెడితే… 7.42 మిలియన్ వ్యూస్ 249 రేటు తో రాగా టోటల్ కలెక్షన్స్ 184.75 కోట్ల కలెక్షన్స్ దక్కగా 499 రేటుతో వచ్చిన 1.8 మిలియన్ వ్యూస్ కి 89.82 కోట్ల కలెక్షన్స్ వచ్చాయట… ఇక టోటల్ గా రెండూ కలిపి 274.57 కోట్ల కలెక్షన్స్ ని సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం. డిసాస్టర్ టాక్ తో ఊరమాస్ ఊచకోత ఇదని చెప్పొచ్చు.

Leave a Comment