న్యూస్

అనుష్క నిశబ్దం ట్రైలర్ 24 గంటల వ్యూస్ & లైక్స్ ఇవే!

లేడీ సూపర్ స్టార్ అనుష్క నుండి కొత్త సినిమా వచ్చి చాలా కాలమే అయింది, రెండేళ్ళ క్రితం భాగమతి సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చి సాలిడ్ విజయాన్ని నమోదు చేసిన తర్వాత కొత్త సినిమా అప్పుడే మొదలు పెట్టినా అది తెరకెక్కి ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా టైమే పడుతుంది, అనుష్క లేటెస్ట్ గా చేస్తున్న మరో ప్రయోగం నిశ్శబ్దం సినిమా. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఈ ఏడాది…

స్టార్టింగ్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అప్పటి నుండి పోస్ట్ పోస్ట్ అవుతూ సమ్మర్ కి అనుకున్నారు, కరోనా ఎంటర్ అవ్వడం తో మళ్ళీ పోస్ట్ పోన్ అయిన సినిమా OTT రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ ఇచ్చినా నో చెప్పారు. ఇప్పుడు రేటు తగ్గిన తర్వాత…

అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కగా 24 గంటల్లో సినిమా ట్రైలర్ తెలుగు లో మరియు తమిళ్ లో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

తెలుగు లో 24 గంటల్లో 6.6 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ తమిళ్ లో వచ్చేసరికి 4.6 మిలియన్స్ రేంజ్ లో వ్యూస్ ని సాధించింది, లైక్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోయిన ఈ ట్రైలర్ తెలుగు లో 39 వేల లైక్స్ ని అందుకుంది… తమిళ్ లో 7 వేల లైక్స్ సాధించింది. ఓవరాల్ గా లేట్ రిలీజ్ వలన ఇబ్బంది పడగా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా రీసెంట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ…

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ తో పోల్చుకుంటే తక్కువ వ్యూస్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. పెంగ్విన్ కి 24 గంటల్లో 8.47 మిలియన్ వ్యూస్ రాగా నిశ్శబ్దంకి తక్కువ వ్యూస్ దక్కాయి. ఇక సినిమా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 2 న రానున్న నేపద్యంలో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Leave a Comment