న్యూస్ బాక్స్ ఆఫీస్

అన్ని రికార్డుల బెండు తీసిన ఆకాశం నీ హద్దురా….మామూలు రికార్డులు కాదివి!

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దు రా సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ నుండి మెస్మరైజింగ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండగా సినిమా ని భారీ రేటు పెట్టి కొన్న అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు ఫుల్ హ్యాప్పీగా తమ ప్లాట్ ఫాంలో మొదటి భారీ డిజిటల్ రిలీజ్ బ్లాక్ బస్టర్ ను ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు.

ఈ సినిమా కోసం ఏకంగా 65 కోట్ల రేటు ని పెట్టిన అమెజాన్ ప్రైమ్ కి ఇప్పుడు ఆ మొత్తం రిటర్న్ వచ్చేసినట్లే అంటూ ట్రేడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, రీసెంట్ గా సినిమా మొత్తం మీద 100 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుందని వార్తలు చక్కర్లు కొట్టగా…

ఇప్పుడు ఆ లెక్కలు ఏకంగా 150 మిలియన్స్ కి పైగానే ఉన్నాయని అంటున్నారు. కానీ ఇవీ యూనిక్ వ్యూస్ కావు, ఒక అకౌంట్ పై ఎన్ని సార్లు అయినా చూసుకోవచ్చు దాదాపు 6-8 మంది అయినా చూడొచ్చు, సో అన్ని వ్యూస్ కలుపుకుని ఈ వ్యూస్ రాగా సినిమాకి మొత్తం మీద…

యూనిక్ వ్యూస్ మాత్రం అటూ ఇటూగా 15 మిలియన్స్ దాకా వచ్చాయి అంటున్నారు. ఒక ID నుండి మల్టిపుల్ వ్యూస్ లెక్కకు మిక్కిలి ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. యూనిక్ వ్యూస్ ఇక ID నుండి ఒక వ్యూ ని మాత్రమే కౌంట్ చేసుకోగా ఓవరాల్ గా 15 మిలియన్స్ దాకా వ్యూస్ ఈ సినిమా కి ఇప్పటి వరకు దక్కాయని ట్రేడ్ లో టాక్ ఉంది.

ఈ రేంజ్ లో యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం కూడా రికార్డ్ అనే చెప్పాలి, ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన లక్ష్మీ సినిమా కూడా ఇదే రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకున్నా ఇప్పుడు ఆ వ్యూస్ లెక్కలను మించి సూర్య ఆకాశం నీ హద్దురా సాలిడ్ రికార్డులను డిజిటల్ లో నమోదు చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.

Leave a Comment