న్యూస్

అపరిచితుడుకి 16 ఏళ్ళు….తెలుగు బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

ఇండియన్ సినిమా హిస్టరీలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా కలగలపి తెరకెక్కిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా అపరిచితుడు, బాక్స్ ఆఫీస్ దగ్గర శంకర్ మరియు విక్రం లు కలిసి చేసిన ఈ మ్యాజిక్ అల్టిమేట్ రిజల్ట్ ను ఇచ్చింది, తమిళ్ లో అన్నియన్ పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ అద్బుతమైన విజయాన్ని నమోదు చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

కానీ అంతకుమించి స్పెషల్ అనిపించేలా తెలుగు లో ఈ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అప్పటికి డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైం రికార్డులను తెలుగు లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. 2005 లో ఇయర్ లో…

ఈ సినిమా రిలీజ్ కి కొన్ని నెలల ముందే వచ్చిన చంద్రముఖి సినిమా 5.6 కోట్ల బిజినెస్ ను తెలుగు లో సొంతం చేసుకుని ఫైనల్ రన్ లో 13.10 కోట్ల షేర్ తో అల్టిమేట్ రికార్డ్ ను సాధించగా అప్పటికి తెలుగు లో పెద్దగా మార్కెట్ ఏమి లేని విక్రం శంకర్ ల కాంబోలో…

రూపొందిన అపరిచితుడు సినిమా పోస్టర్స్ అండ్ ట్రైలర్ తో అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకోగా శంకర్ పేరు మీద ఏకంగా 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను 2005 టైం లోనే సొంతం చేసుకుని తెలుగు లో రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఏకంగా…

14 కోట్లకు పైగా షేర్ ని తెలుగులో సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, పెట్టిన 7 కోట్లకు మరో 7 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ ఎపిక్ మూవీ రిలీజ్ అయ్యి నేటితో 16 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం. ఇక ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతున్న సినిమా అక్కడ ఎలాంటి భీభత్సం క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a Comment