న్యూస్ బాక్స్ ఆఫీస్

అఫీషియల్:53 కోట్లు ఔట్…మాస్ కంబ్యాక్ అంటే ఇదీ!!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన రోజు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు, తర్వాత థియేటర్స్ ఇబ్బందులు కూడా ఎదురు అయ్యాయి, కానీ ఇవేవి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఊచకోత కోయడానికి ఏమాత్రం అడ్డంకిగా అయితే నిలవలేదు అనే చెప్పాలి…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా రెట్టించిన జోరు చూపుతూ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా. మొత్తం మీద ఇప్పుడు…

14 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో అఫీషియల్ గా సినిమా 53 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది…రవితేజ కెరీర్ లో ఇది వరకు రాజా ది గ్రేట్ సినిమా టోటల్ రన్ లో…

51.8 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు క్రాక్ సినిమా రెండు వారాలు పూర్తీ అయ్యే టైం కి ఈ మార్క్ ని అందుకుని ఇప్పుడు 53 కోట్ల గ్రాస్ తో రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది. మొదటి రోజు సజావుగా రిలీజ్ ను సొంతం చేసుకుని ఉంటె ఈ లెక్క 60 కోట్ల మార్క్ ని ఇప్పుడు అందుకుని ఉండేది అని చెప్పాలి. ఏది ఏమైనా లాంగ్ రన్ లో ఈ సినిమా…

ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తున్న సినిమా ఇప్పుడు రవితేజ కి నికార్సయిన కంబ్యాక్ మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది.. 4 బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తో మాస్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు.

Leave a Comment