గాసిప్స్ న్యూస్

అమ్మటానికి ఛాన్స్ లేదు…అయినా అమ్మేశారు…మాస్ట్రో రిలీజ్ డేట్ ఇదే!

యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ట్రో… హిందీ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధ ధూన్ సినిమా కి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది ఈ సినిమా. హిందీ లో చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన టాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి సత్తా చాటుకుంది. ఇక తెలుగు లో మంచి హైప్ నడుమ మంచి స్టార్ కాస్ట్ తో…

ఈ రీమేక్ ని మొదలు పెట్టారు, నితిన్ నభా నటేష్ లు జంటగా తమన్నా నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో నటిస్తున్న ఈ సినిమా పోస్టర్స్ అండ్ సాంగ్స్ తో పర్వాలేదు అనిపించే హైప్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే…

రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన రిలీజ్ కి అడ్డంకి ఏర్పడగా మంచి రేటు కి డిజిటల్ రిలీజ్ ఆఫర్ రావడం తో ఆల్ మోస్ట్ డీల్ ని క్లోజ్ చేసే టైం లో కొత్త సినిమాలు ఏవి అక్టోబర్ వరకు డిజిటల్ రిలీజ్ కాకూడదు….

అంటూ రూల్ పెట్టడం తో ఎటూ తేల్చుకోలేక పోతున్న సినిమాకి నారప్ప రిలీజ్ ఊపిరి పోసింది. దాంతో ఈ సినిమా అగ్రిమెంట్ కూడా ఆల్ రెడీ అయిపోయిందని చెబుతూ సినిమాను డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అమ్మటానికి ఛాన్స్ లేదు కానీ ఆల్ రెడీ అగ్రిమెంట్స్ జరిగాయని చెప్పి 34 కోట్లకి సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ వాళ్ళకి అమ్మేశారు.

ఇక సినిమా ను వచ్చే నెల 15 న ఇండిపెండెంట్స్ డే కానుకగా డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి బజ్ పెద్దగా లేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ పెరుగుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. బాక్ టు బాక్ 2 ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను నిజం చేస్తుందో చూడాలి.

Leave a Comment