టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

అమ్మింది 1.5 కోట్లు…టోటల్ గా వచ్చింది..2019 లో ఇది రెండోసారి!!

2019 ఇయర్ లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన స్ట్రైట్ సినిమాలలోనే తక్కువ హిట్స్ ఉన్నాయి, ఇక డబ్బింగ్ మూవీస్ లో హిట్స్ గా నిలిచే సత్తా కొన్ని సినిమాలకు అయినా దక్కుతుంది అనుకుంటే టోటల్ సమ్మర్ ఎండ్ వరకు ఒక్క కాంచన 3 సినిమా తప్పితే మరే సినిమా హిట్ గీత ని దాటలేదు. కానీ అలాంటి సమయం లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా కిల్లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర…

టోటల్ రన్ లో మంచి విజయాన్నే నమోదు చేసింది, బిచ్చగాడు సినిమా తో తెలుగు లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ ఆంథోని కి తర్వాత మళ్ళీ ఒక్క హిట్ కూడా ఇక్కడ సొంతం కాలేదు, ఇలాంటి సమయం లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన…

కిల్లర్ మంచి టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది. సినిమాను తెలుగు లో 1.5 కోట్ల రేంజ్ బిజినెస్ కి అమ్మగా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ముగిసే సరికి..

2.32 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి సొంతం చేసుకుంది. పెద్దగా ప్రమోషన్స్ లాంటివి చేయకున్నా కానీ సినిమా మౌత్ టాక్ తోనే బిజినెస్ ని దాటి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని తెలుగు లో క్లీన్ హిట్ గా నిలవడమే కాకుండా 2019 ఇయర్ లో టాలీవుడ్ లో కాంచన 3 తర్వాత…

రెండో క్లీన్ హిట్ మూవీ గా నిలిచింది. బిచ్చగాడు 16 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా తర్వాత రెండో హిట్ గా నిలిచింది ఈ సినిమా. దాంతో ఇక మీదట చేసే సినిమాలతో ఇక్కడ మరిన్ని హిట్స్ కొట్టాలని విజయ్ ఆంథోని భావిస్తున్నాడు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment