న్యూస్ రివ్యూ

అరణ్య రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

బాహుబలి తో ఎనలేని పేరు సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి ఆ పేరు ను క్రేజ్ ని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి పోగొట్టుకోకుండా క్వాలిటీ అండ్ కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తూ కాపాడుకుంటూ వస్తూ ఉండగా కొంత గ్యాప్ తర్వాత రానా నటించిన లేటెస్ట్ మూవీ అరణ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… తన తాతల కాలం నుండి కాపాడుకుంటూ వస్తున్న అడవిలో 40 ఏళ్ళుగా తానూ కాపాడుకుంటూ వస్తున్న హీరో రానా కి ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియా అవార్డు రాష్ట్రపతి నుండి సొంతం అవుతుంది, అడవే జీవితంగా భావించే హీరో అడవిని ఏనుగులను కాపాడుకుంటూ ఉండగా…

స్మార్ట్ సిటీ పేరుతో సెంట్రల్ మినిస్టర్ ఆ అడవిలో 60 ఏకరాలు వాడుకోవడానికి పనులు మొదలు పెట్టగా హీరో  కాపాడుకున్నాడా లేదా…. మినిస్టర్ రానా ని ఆపడానికి ఎం చేశాడు. చివరికి ఎం జరిగింది అన్నది సినిమా కథ… ఇలాంటి కథ పాయింట్ లు చాలానే మనం ఇది వరకు ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నాం.

కానీ ఇక్కడ కంప్లీట్ అడవి నేపధ్యంలో సినిమా ఉండటం కొంచం కొత్తగా ఉండగా మొదటి 30 నిమిషాలు సినిమా ఫ్రెష్ గా బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత నుండి స్లో అవ్వడం మొదలు పెట్టిన సినిమా ఎలాగోలా ఫస్టాఫ్ బాగుంది అనిపించేలా ముగిసినా సెకెండ్ ఆఫ్ మెలో డ్రామా, డ్రాగ్ సీన్స్, స్లో నరేషన్ ఇలా అనేక అవరోధాలను ఎదురుకుంటూ పోతుంది… క్లైమాక్స్ కి మళ్ళీ తేరుకుని…

పర్వాలేదు అనిపించే విధంగా ముగుస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయింది, ఇలాంటి కథని రానా ఒప్పుకోవడం అద్బుతంగా నటించడం, ఓవరాల్ గా వన్ మ్యాన్ షో గా సినిమా మొత్తాన్ని తన భుజాన మోయడం జరిగింది కానీ వెయిట్ మరీ ఎక్కువ అయింది.. తన వరకు రానా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు.

ఇక చిన్న రోల్స్ చేసిన విష్ణు విశాల్, హీరోయిన్స్ జస్ట్ ఓకే అనిపించుకోగా… బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…ప్రభు సోలమన్ ఇలాంటి నేపధ్యంలోనే కొన్ని ఇతర సినిమాలు తీసినా…

ఈ సారి మరింత డెప్త్ ఉన్న స్టొరీని ఎంచుకుని ఏనుగుల వలన ఉపయోగం ఏంటి, అడవుల వలన ఉపయోగం లాంటి విషయాలను బాగానే చెప్పిన ఎంచుకున్న మార్గం చాలా సింపుల్ గా ఉంది… అక్కడే సినిమా ట్రాక్ తప్పినట్లు అనిపించింది. అలా అనీ మొత్తానికి నీరు గార్చే సినిమా కాదు కానీ ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది.

మొత్తం మీద రానా నటన కోసం, విజువల్స్ కోసం, ఒకసారి చూడొచ్చు. సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…  సెకెండ్ ఆఫ్ ని మరింత బాగా డీల్ చేసి ఉంటె సినిమా ఇంకా చాలా బెటర్ గా వచ్చి ఉండేది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక..

Leave a Comment