న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

అరవింద సమేత TRP కుమ్ముడేనా?

గత కొంతకాలంగా రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల TRP లలో కొన్ని మాత్రమె అంచనాలను అందుకునే విధంగా TRP రేటింగ్ లను సాధిస్తున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత జీ తెలుగు లో 13 జనవరి లో టెలికాస్ట్ అయింది. కాగా ఈ సినిమా పండగ ముందుగా ఆదివారం టెలికాస్ట్ అవ్వడం తో TRP రేటింగ్ ల విషయం లో దుమ్ము లేపుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

కానీ సినిమా ఒరిజినల్ ప్రింట్ రిలీజ్ అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది, ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ఆడియన్స్ సినిమా ని ఇప్పటికే చూసేశారు, ఇక పండగ సమయం లో కొత్త సినిమా ల కోసం కూడా థియేటర్స్ కి భారీ గా నే క్యూ కట్టారు.

ఇలాంటి సమయం లో TRP రేటింగ్ ఎలా వస్తాయి అన్నది ఆసక్తి గా మారగా మినిమమ్ 18 రేంజ్ లో TRP మాత్రం పక్కా అని టాక్ వినిపిస్తుంది. సినిమా TRP రేటింగ్ BARC వారు ఈ నెల 24 న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి TRP ఎంత వస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!