న్యూస్

అరవ ఫ్యాన్స్ అతి…చెడుగుడు ఆడేసుకుంటున్న టాలీవుడ్ ఫ్యాన్స్!

టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కి కోలివుడ్ హీరోల ఫ్యాన్స్ కి అప్పుడప్పుడు సోషల్ మీడియా లో గొడవలు జరగడం అన్నది సర్వ సాదారణంగా జరుగుతూనే ఉంటాయి. ఎదో ఒక కారణం మీద వాళ్ళు మన వాళ్ళని ట్రోల్ చేయడం తర్వాత మన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళని ట్రోల్ చేయడం కూడా కామనే… అయినా కానీ అప్పుడప్పుడు ఒకరినొకరు గిల్లడం మాత్రం మానరు. లేటెస్ట్ గా నారప్ప సినిమా విషయం లో కూడా ఇదే జరిగింది.

సినిమాను ఒరిజినల్ లో నటించిన ధనుష్ అసురన్ తో పోల్చి మా సినిమాతో పోల్చితే నారప్ప మినిమం కూడా లేదంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు అరవ ఫ్యాన్స్.. వేరే హీరోల విషయం లో ట్రోల్ అయితే ముందు ఆ హీరో ఫ్యాన్సే వస్తారు కానీ… వెంకటేష్ రవితేజ ఇలా కొందరి విషయం లో…

అయితే టోటల్ టాలీవుడ్ ఫ్యాన్స్ అటాక్ మోడ్ ఆన్ చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. కొందరు రెండు సినిమాలను కంపేర్ చేసి ధనుష్ తో పోల్చితే వెంకటేష్ యాక్టింగ్ అంత బాలేదు అన్న వాళ్లందరికీ వెంకటేష్ ఎప్పుడో తన నటనతో మెప్పించిన గణేష్, ధర్మ చక్రం లాంటి సినిమాల్లో యాక్టింగ్ ని చూపెట్టి….

ఇది వెంకటేష్ కొన్ని దశాబ్దాల క్రితమే తన నటనతో ఆ టైం కే ఎన్నో మెట్లు ఎక్కాడు… ఇప్పుడు మీరా ఆయన్ని కామెంట్ చేస్తుంది అంటూ కోలివుడ్ వాళ్ళు మన వాళ్ళ రీమేక్ లు చెడగొట్టిన అర్జున్ రెడ్డి, టెంపర్ ఇలా అనేక సినిమాలను చూపెట్టి ఇంత వరస్ట్ రీమేక్ లు మేమైతే చేయం అంటూ ఓ రేంజ్ లో అందరూ కలిసి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో దెబ్బకి వెనక్కి తగ్గినట్లే తగ్గిన్నా ఎవరో ఒకరిద్దరూ…

ట్రోల్ చేస్తూనే ఉన్నారు…. ధనుష్ తన ఏజ్ కి మించి అద్బుతంగా అసురన్ లో నటించి మెప్పించాడు. ఇక్కడ వెంకటేష్ రోల్ ధనుష్ రోల్ కి ఏమాత్రం తీసి పోని విధంగా ఆ రోల్ కి ఉన్న ప్రాముఖ్యతని అలానే మెయిన్ టైన్ చేసి యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇద్దరూ ఆ రోల్ కి ఫుల్ న్యాయం చేశారు. అలాంటిది అంత బాగా యాక్టింగ్ ని ట్రోల్ చేయడం అంటే వీళ్ళకి అతి మాములుగా లేదనే చెప్పాలి.

Leave a Comment