న్యూస్ రివ్యూ

“అర్జున్ సురవరం” రివ్యూ… హిట్టా – ఫట్టా!!

కెరీర్ ని అద్బుతంగా ఆరభించినా తర్వాత స్లో డౌన్ అయిన నిఖిల్ మళ్ళీ స్వామిరారా, కార్తికేయ మరియు ఎక్కడికి పోతావు చిన్నవాడా తో యమ స్పీడ్ అందుకోగా తర్వాత మళ్ళీ అనుకోకుండా స్లో అయ్యాడు. కిరాక్ పార్టీ అంచనాలను అందుకోలేదు. తర్వాత ఇయర్ ఎండ్ లో రావాల్సిన సినిమా వరుసగా పోస్ట్ పోన్ లు అవుతూ ఎట్టకేలకు పేరు మారి ఇప్పుడు అర్జున్ సురవరంగా నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసింది.

మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే… సోషల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే జర్నలిస్ట్స్ అయిన హీరో హీరోయిన్స్ లో హీరో అనుకోకుండా ఒక బ్యాంక్ స్కాం లో ఇరుక్కుంటాడు. తర్వాత తనతో పాటు చాలా మంది ఈ స్కాం లో ఇరుకున్నారు అని తెలుసుకుని…

ఎలా ఆ స్కాం నుండి బయట పడ్డాడు ఆ స్కాం చేసిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు. అన్నది ఓవరాల్ గా సినిమా కథ, ఇందులో సర్టిఫికేట్ స్కాంస్ ఇలా చాలా అంశాలనే చూపించారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిఖిల్ సినిమా కి ఎంత కావాలో అంత నటించి మెప్పించాడు.

యాక్షన్ సీన్స్ లో కూడా మెప్పించాడు, హీరోయిన్ లావణ్య త్రిపాటి గ్లామర్ తో ఆకట్టుకోగా నిఖిల్ తో తన కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు అందరు తమ తమ రోల్స్ లో మెప్పించారు. ఇక సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరి పోయింది.చేజింగ్ సీన్స్, హీరో విలన్స్ మధ్య మైండ్ గేమ్ సీన్స్ కి అదిరి పోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా ఇంపాక్ట్ చూపింది.

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్టాఫ్ కొంచం స్లో గా స్టార్ట్ అయినా కొద్ది సేపు తర్వాత పుంజుకోగా ఇంటర్వెల్ వరకు ఆసక్తిగా సాగా మంచి ఇంపాక్ట్ చూపే ఇంటర్వెల్ తో సెకెండ్ ఆఫ్ పై ఆసక్తి పెరిగినా సెకెండ్ ఆఫ్ నరేషన్ లో పట్టు తగ్గింది. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ సెకెండ్ ఆఫ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది.

ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుండగా డైరెక్షన్ పరంగా ఫస్టాఫ్ ని డీల్ చేసినంత బాగా సెకెండ్ ఆఫ్ ని డీల్ చేయలేదు డైరెక్టర్ టి. సంతోష్. లెంత్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలగగా అక్కడ సీన్స్ చాలా డ్రాగ్ అయ్యాయి. కానీ ఉన్నంతలో ఎక్కువ సేపు బోర్ కొట్టించక పోవడం విశేషం.

ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, నిఖిల్ పెర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ, బ్యాగ్రౌండ్ స్కోర్, కథ పాయింట్ ఇక మైనస్ ల విషయానికి వస్తే సెకెండ్ ఆఫ్ స్లో అండ్ డ్రాగ్ అవ్వడం, ఎడిటింగ్ షార్ప్ గా లేక పోవడం మేజర్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మరీ అద్బుతం అనిపించదు కానీ…

ఉన్నంతలో ఈజీ గా ఒకసారి చూసే విధంగా ఉంటుంది, సమాజంలో జరిగే స్కామ్స్ గురించి బాగా చూపెట్టి అవేర్ నెస్ ని పెంచే విధంగా సినిమా ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ఈజీగా ఒకసారి చూడొచ్చు. సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…

Leave a Comment