న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

అల్లరి నరేష్ బంగారు బుల్లోడు టోటల్ బిజినెస్ అండ్ థియేటర్స్ కౌంట్ ఇదే!

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రతీ ఏడాది మినిమమ్ 3 – 4 సినిమాలు చేస్తూ తన కంటూ 10 -12 కోట్ల రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోగా దూసుకు పోయిన హీరో అల్లరి నరేష్, 2012 లో సుడిగాడు సినిమా తో తన బాక్స్ ఆఫీస్ స్టామినాని  అమాంతం పెంచుకునే క్రేజ్ ను సొంతం చేసుకున్నా తర్వాత మళ్ళీ అలాంటి హిట్ మూవీ అల్లరి నరేష్ కి పడలేదు. ఏళ్ళు గడుస్తున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

క్లీన్ హిట్ మూవీ కూడా ఇన్నాళ్ళు పడలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ ని అందుకోలేక పోతున్న అల్లరి నరేష్ మరోసారి హిట్ ని అందుకోవాలని చేస్తున్న ప్రయత్నమే బంగారు బుల్లోడు సినిమా. లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మొత్తం మీద…

సాధించిన బిజినెస్ అండ్ టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్కలు ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే… సినిమా నైజాం లో 1 కోటి బిజినెస్ ను, సీడెడ్ లో 50 లక్షల బిజినెస్ ను అలాగే ఆంధ్రా లో 1.5 కోట్ల…

ప్రీ రిలీజ్ బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా 3.2 కోట్ల బిజినెస్ ను టోటల్ గా అందుకుంది. దాంతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా 3.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు…

400 నుండి 420 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా సినిమా 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా కి మంచి టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అండ్ జనవరి 26 హాలిడే తో కూడా కలిసి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. మరి సినిమా ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Leave a Comment