గాసిప్స్ న్యూస్

అల్లుఅర్జున్ సెన్సేషనల్ డిసిషన్…5 భాషల్లో ఒకేసారి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాఫ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఆడియన్స్ తననుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసినా ఫ్యామిలీ మూవీ అల వైకుంఠ పురం లో సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ సినిమా టాలీవుడ్…

న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న “పుష్ప” సినిమా ని పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ బర్త్ డే కి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తూనే కొత్త థ్రిల్ కూడా ఇవ్వగా నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ సాలిడ్ గా ఉండటం తో ఈ సినిమా హిందీ లో ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక సినిమా గురించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…

పాన్ ఇండియా లెవల్ లో వస్తున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అన్ని భాషల్లో తన ఓన్ వాయిస్ నే వినిపించాలని ఫిక్స్ అయ్యాడట, తెలుగు తమిళ్ బాగా వచ్చిన అల్లు అర్జున్ హిందీ కూడా మ్యానేజ్ చేయగలడట, ఇక కన్నడ కూడా టచ్ ఉండగా మలయాళం చాలా వరకు మ్యానేజ్ చేయగలడట.

దాంతో ఈ సినిమా మరింత స్పెషల్ అయ్యేందుకు అన్ని భాషల్లో ఓన్ గా డబ్ చెప్పాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. కచ్చితంగా ఇది తన మార్కెట్ ఎక్స్ పాన్షన్ మరింత భారీ గా జరిగేలా హెల్ప్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత షూట్ మొదలు పెట్టి వచ్చే ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారని సమాచారం…

Leave a Comment