న్యూస్ బాక్స్ ఆఫీస్

అల్లుడు అదుర్స్: అమ్మింది 9.4 కోట్లకి…7 రోజుల్లో వచ్చింది ఇది…సాలిడ్ దెబ్బ ఇది!

కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఆ హిట్ వచ్చిన వెంటనే రొటీన్ కాన్సెప్ట్ తో చేసిన కమర్షియల్ ఎంటర్ టైనర్ అల్లుడు అదుర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సంక్రాంతి కానుకగా సడెన్ గా రేసులోకి ఎంటర్ అయ్యి మిగిలిన సినిమాలతో పోటి పడి రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ బాగున్న కానీ..

సినిమా టాక్ జనాలలో రొటీన్ రొట్ట మూవీ అన్నట్లు వెళ్ళడం తో మిగిలిన సినిమాలకు టికెట్స్ దొరకక పొతే ఈ సినిమా కి వెళ్ళడం మొదలు పెట్టగా వీకెండ్ వరకు సినిమా బాగానే కలెక్షన్స్ ని సాధించినా తర్వాత మాత్రం పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింత స్లో డౌన్ అవ్వగా సినిమా మొత్తం మీద 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 19 లక్షల షేర్ ని మాత్రమే వసూల్ చేసింది, ఈ రేంజ్ లో స్లో అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ఇవి…

👉Nizam: 2.10Cr
👉Ceeded: 1.36Cr
👉UA: 1.41Cr
👉East: 51L
👉West: 48L
👉Guntur: 51L
👉Krishna: 28L
👉Nellore: 23L
AP-TG Total:- 6.88CR (11.43Cr Gross~)
KA+ROI: 13L
OS: 5L
Total:- 7.06Cr(12Cr~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ అండ్ గ్రాస్ కలెక్షన్స్. సినిమా సోలోగా వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ సంక్రాంతి హాలిడేస్ లో రావడం తో ఏవైనా కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బిజినెస్ 9.4 కోట్లు కాగా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.8 కోట్ల రేంజ్ షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం పూర్తీ అయిన తర్వాత 7.06 కోట్ల షేర్ తో టోటల్ గా మరో 2.74 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ప్రస్తుతానికి అసాధ్యంగా కనిపిస్తున్న ఈ టార్గెట్ రెండో వారం సినిమా జోరు చూపితే అందుకోవచ్చు. లేదా బిలో యావరేజ్ గా మిగిలే అవకాశం ఉంది.

Leave a Comment