గాసిప్స్ న్యూస్

అల్లు అర్జున్ అప్ కమింగ్ 5 సినిమాలు ఇవే…ఇదేమి రచ్చ సామి!!

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ సరైనోడు తర్వాత మరో హిట్ కొట్టడానికి కొంత టైం తీసుకున్నా అల వైకుంఠ పురంలో సినిమా తో అల్టిమేట్ ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫాం లో జోరు చూపుతున్నాడు, ఆ ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప అంటూ పాన్ ఇండియా లెవల్ లో…

రచ్చ చేయడానికి సిద్ధం అవ్వగా ఈ సినిమా ఇప్పుడు 2 భాగాలుగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం కానుంది, ఇక ఇప్పుడు ఈ సినిమా 2 భాగాలు అవ్వడం కన్ఫాం అవ్వడం తో అప్ కమింగ్ మూవీస్ లిస్టు ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా…

గీతా ఆర్ట్స్ బ్యానర్ కో ప్రొడ్యూసర్ బన్నీ వాసు రీసెంట్ గా మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీస్ పై మంచి క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ 20 వ సినిమాగా పుష్ప ఆడియన్స్ ముందుకు వస్తుందని, తర్వాత 21 వ సినిమాగా కాన్సిల్ అయింది అనుకున్న ఐకాన్ సినిమా ఉంటుందని…

ఆ సినిమా కి వేణు శ్రీ రామే డైరెక్టర్ అని కన్ఫాం చేశారు. ఇక 22 వ సినిమాగా పుష్ప పార్ట్ 2 వస్తుందని తెలియజేశారు. ఈ సినిమాల తర్వాత అల్లు అర్జున్ ఏ ఆర్ మురగదాస్ తో ఒక సినిమాను, బోయపాటి శ్రీను తో ఒక సినిమాను, కొరటాల శివ తో ఒక సినిమాను కమిట్ అయ్యారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే…

తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకేక్కే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు, వీటితో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఉండొచ్చని అంటున్నారు. అన్నీ కూడా భారీ లెవల్ లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందే సినిమాలు అంటూ ఉండటం విశేషం. అప్ కమింగ్ మూవీస్ తో అల్లు అర్జున్ ఓ రేంజ్ లో రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment