గాసిప్స్ న్యూస్

అల వైకుంఠ పురంలో “టీసర్” రిలీజ్ ఎప్పుడో లీక్ అయ్యిందోచ్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర కి పైగా టైం అవుతుంది, 2018 లో నా పేరు సూర్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ తన కొత్త సినిమా మొదలు పెట్టాడానికి ఏడాది సమయం తీసుకున్నాడు, ఎట్టకేలకు త్రివిక్రమ్ తో మొదలు పెట్టిన అల వైకుంఠ పురంలో సినిమా సంక్రాంతి కి రానుండటంతో అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తుండగా… రెండు నెలల ముందు నుండే సినిమా…

పాటలను ఒక్కోటి గా రిలీజ్ చేస్తూ సినిమా పై మంచి బజ్ పెరిగేలా చేశారు యూనిట్ వర్గాలు సినిమా లో రిలీజ్ అయిన మూడు పాటలు కూడా అభిమానుల సామాన్య ప్రేక్షకుల మనసు ని గెలుచుకుని మంచి సక్సెస్ అవ్వగా ఇప్పుడు అఫీషియల్ టీసర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని…

అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు… కాగా యూనిట్ వర్గాల నుండి లీక్ అయిన ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం సినిమా అఫీషియల్ టీసర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట. టాక్ నిజం అయితే డిసెంబర్ మొదటి వారం లో సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

సంక్రాంతి కి పోటి లో రిలీజ్ కానున్న అల వైకుంఠ పురంలో ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకోగా పోటి లో ఉన్న మరో సినిమా సరిలేరు నీకెవ్వరు టీసర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసింది, ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్ చేయడానికి రిలీజ్ అవుతున్న తొలి పెద్ద హీరో సినిమా టీసర్ అల్లు అర్జున్ దే..

ఇప్పటికే రిలీజ్ అయిన మూడు లిరికల్ వీడియోల్లో 2 సార్లు 24 గంటల పరంగా సరికొత్త రికార్డులు నమోదు అవ్వగా ఇప్పుడు టీసర్ తో లాంగ్ గ్యాప్ ని మరిపించడమే కాకుండా అంచనాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మరి టీసర్ లీక్ అయిన న్యూస్ ప్రకారం డిసెంబర్ మొదటి వారం ఎండ్ లో వస్తుందో లేదో చూడాలి.

Leave a Comment