న్యూస్ రివ్యూ వీడియో

అల వైకుంఠ పురంలో ట్రైలర్ రివ్యూ…ప్లస్&మైనస్ పాయింట్స్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో భారీ అంచనాల నడుమ ఈ నెల 12 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని సినిమా మ్యూజికల్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ని చాలా వరకు రిలీజ్ చేసినట్లే అనిపిస్తుంది ట్రైలర్ లో…మిడిల్ క్లాస్ అబ్బాయ్ ఓ డబ్బున్న ఫ్యామిలీ లో పని చేస్తూ ఉంటాడు… అతని స్టొరీ నే ఈ సినిమా.. అల్లు అర్జున్ తన డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ లో కూడా కుమ్మేశాడు.

మిగిలిన స్టార్ కాస్ట్ ని చాలా వరకు రివీల్ చేయగా భారీ స్టార్ కాస్ట్ కూడా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. తమన్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ మరోసారి హైలెట్ కాగా ఓవరాల్ గా ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ట్రైలర్ లో ఉండటం విశేషం…ఇవి హైలెట్స్ గా నిలవగా…

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రీవియస్ మూవీస్ చాలా వరకు ట్రైలర్ చూస్తున్న టైం లో గుర్తుకు రావడం చిన్న మైనస్ పాయింట్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాల లైన్ లోనే సినిమా ఉందని పించేలా ట్రైలర్ కొద్ది వరకు అనిపించింది. అయినా కానీ… ఈ సారి ట్రీట్ మెంట్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ మీద…

పక్కా ఎంటర్ టైన్ మెంట్ మీద పెట్టారని ట్రైలర్ లో అర్ధం అవుతుంది కాబట్టి మరో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమా రేంజ్ లో అల వైకుంఠ పురంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సంక్రాంతి పోటి లో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. మీరు ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పండి..

Leave a Comment