న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురంలో డే 2 కలెక్షన్స్…మెంటల్ మాస్ కుమ్ముడు!!

బాక్స్ ఆఫీస్ దగ్గర స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో మొదటి రోజు తక్కువ థియేటర్స్ లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా సినిమా రెండో రోజు కొన్ని థియేటర్స్ ని కోల్పోయినా కానీ అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే రేంజ్ లో అన్ని సెంటర్స్ లో ఆదరగోట్టేస్తుంది. సినిమా మొదటి 2 షోలకు 15% వరకు డ్రాప్స్ ని అందుకున్నా…

తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి అద్బుతమైన గ్రోత్ తో ఆల్ మోస్ట్ 95% రేంజ్ లో ఆక్యుపెన్సీ తో రన్ అయ్యి సంచలనం సృష్టించింది, మాస్ సెంటర్స్ లో కూడా సినిమా సెన్సేషనల్ గా హోల్డ్ చేయడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా రెండో రోజు ఇప్పుడు

రెండు తెలుగు రాష్ట్రాలలో 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ గట్టిగా ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 వ రోజున 11 కోట్ల నుండి 11.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఓవర్సీస్ లో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ను నమోదు చేస్తూ 1.5 మిలియన్ వైపు దూసుకు పోతుంది.

మొత్తం మీద అల్లు అర్జున్ కేరిస్ బెస్ట్ కలెక్షన్స్ ని నమోదు చేస్తూ దూసుకు పోతున్న సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 85 కోట్ల మార్క్ లో సగానికి పైగా రికవరీ ని సొంతం చేసుకోబోతుంది, ఇక అసలు సిసలు సెలవులు 3 వ రోజు నుండి మొదలు కానున్నాయి కాబట్టి.

పక్కా ఫ్యామిలీ మూవీ అయిన ఈ సినిమా ఈ అడ్వాంటేజ్ ని అద్బుతంగా వాడుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా మూడు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

2 Comments

  • Hello T2B, iam one of the user of your website. From past few days your website taking too much time to loading, try to solve this issue as soon as possible because its really irritating otherwise it is my favourite kovie news website. Special thanks for giving movie updates.

Leave a Comment