న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురంలో డే 2 స్టేటస్…ఈ కుమ్ముడేంటి సామి!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తక్కువ థియేటర్స్ లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా సినిమా రెండో రోజు కి వచ్చే సరికి ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి గా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే రేంజ్ లో హోల్డ్ చేసింది.

మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ కేవలం 15% లోపే ఉండటం అది కూడా సోమవారం రోజున జరగడం అంటే మామూలు రచ్చ కాదు, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అదిరి పోయే రేంజ్ లో జరుగుతున్నాయి. దాంతో సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం, ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…

అన్నీ అనుకున్నట్లు ఉంటె బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని చెప్పొచ్చు. ఇక సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే 1.4 మిలియన్ మార్క్ ని అందుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది.

రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని లెక్కలు అనుకున్న విధంగా ఉంటె సినిమా ఊహకందని లెవల్ లో తక్కువ థియేటర్స్ లోనే రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది, రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment