న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురంలో డే 3 కలెక్షన్స్….ఊచకోతకి పరాకాష్ట!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే 48 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా సినిమా మూడో రోజు భోగి హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మొత్తం మీద…

85% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి ఏకంగా 95% నుండి 98% వరకు ఆక్యుపెన్సీ రన్ అయింది, కొన్ని సెంటర్స్ లో 100% ఆక్యుపెన్సీ తో రన్ అవుతూ దూసుకు పోయింది. ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగున్నాయి.

ఇక ఎక్స్ ట్రా షోలకు కూడా రెస్పాన్స్ బాగానే ఉంటె సినిమా మరో సారి దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా మరో సారి 9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని 3 వ రోజు సొంతం చేసుకోవచ్చు. మొత్తం మీద 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 59 కోట్ల రేంజ్ లో ఉండబోతున్నాయి. ఓవరాల్ గా 3 వ రోజు భారీ పోటి లో కూడా సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది.

ఇక సినిమా అమెరికాలో అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది, 1.6 మిలియన్ మార్క్ ని అధిగమించిన సినిమా ఇప్పుడు 2 మిలియన్స్ వైపు దూసుకు పోతుంది, మొత్తం మీద సంక్రాంతి సెలవులను ఫుల్లు గా వాడుకుంటున్న ఈ సినిమా ఈ వారం లో బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు. ఇక 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment