న్యూస్ రివ్యూ

“అల వైకుంఠ పురంలో” ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

దాదాపు 2 ఏళ్ల లోపు గ్యాప్ తీసుకుని తనకి జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి మంచి మూవీస్ ని అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మూడో సారి నటిస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు “అల వైకుంఠ పురంలో” సినిమా తో వచ్చేశాడు, సంక్రాంతి రేసులో భారీ పోటి నడుమ నేడు వచ్చేసిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుంది.

అక్కడ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.. కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకపోయినా మిడిల్ క్లాస్ కుర్ర్రాడు ఓ బడా ఫ్యామిలీ లో వర్క్ చేస్తాడు, కానీ తన లైఫ్ లో ఓ పెద్ద ట్విస్ట్ ఉంటుంది, అది థియేటర్స్ లోనే చూసి తీరాలి అని చెప్పొచ్చు.

బయట ఆల్ రెడీ లీక్ అయినప్పటికీ కథ పాయింట్ చెబితే ఇంట్రెస్ట్ కొంచం తగ్గుతుంది, పెర్ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్ తన లుక్స్, స్టైల్ అండ్ యాటిట్యూడ్ తో దుమ్ము లేపాడని, కామెడీ టైమింగ్ తో హీరోయిజం సీన్స్ లో తన స్పెషాలిటీ చూపించాడని, సాంగ్స్ లో సింపుల్ స్టెప్స్ తోనే దుమ్ము లేపాడని అంటున్నారు.

ఇక హీరోయిన్ పూజా హెడ్గే రోల్ పర్వాలేదు అనిపించగా నివేదా పెతురాజ్ రోల్ కూడా మెప్పిస్తుందని, ఇక సుశాంత్ అండ్ నవదీప్ ల రోల్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక భారీ స్టార్ కాస్ట్ వెండితెరపై వీనుల విందులా అనిపిస్తుందని అంటున్నారు. ఇక సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్…

తమన్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని అంటున్నారు, పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడటానికి అంతకన్నా మించి ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇక సినిమా లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగిందని, అలాగే కథ…

త్రివిక్రమ్ ఇతర మూవీస్ ని అక్కడక్కాడా గుర్తు చేసే విధంగా ఉందని, విలన్ సముద్రఖని రోల్ జస్ట్ ఒకే అనిపించే విధంగా ఉందని అంటున్నారు. త్రివిక్రమ్ మరీ అద్బుతం కాదు కానీ మళ్ళీ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి కి ఏమాత్రం తీసిపోని సినిమా ఇచ్చాడని అంటున్నారు.

మొత్తం మీద త్రివిక్రమ్ ఇది వరకు తీసిన సినిమాలను మైండ్ లో పెట్టకుండా చూస్తె ఇది చాలా బాగా మెప్పిస్తుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఫైనల్ గా సినిమా కి ప్రీమియర్ షోల నుండి ఎబో యావరేజ్ నుండి హిట్ కి తగ్గని టాక్ లభిస్తుందని చెప్పొచ్చు.

త్రివిక్రమ్ మూవీస్ కి ఇలాంటి టాక్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటే ఈ టైం లో ఓవర్సీస్ లో ఇక కుమ్ముడే అని చెప్పాలి. ఇక సినిమా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ని కంటిన్యు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ స్పెశలిస్ట్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment