గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురంలో రీమేక్ కి రికార్డ్ రేటు…హీరో ఇతనే??

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేసిందో తెలిసిందే, టాలీవుడ్ చరిత్ర లో సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ రన్ లో అవలీలగా 160 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ దూసుకు పోతుంది.

కాగా సినిమా రిలీజ్ అయ్యి 30 రోజులు అవుతున్నా జోరు తగ్గడం లేదు, ఇలాంటి టైం లో సినిమా విజయాన్ని చూసి బాలీవుడ్ లో సినిమా ను భారీ ఎత్తున రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. కాగా రీమేక్ రైట్స్ రేటు రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ సినిమా రీమేక్ రైట్స్ కి ఏకంగా 8.10 కోట్ల రేటు దక్కినట్లు సమాచారం. ఇది నిజంగానే సెన్సేషనల్ రేటు అని చెప్పాలి. ఈ సినిమా ను ఇప్పుడు బాలీవుడ్ లో 2 ఇద్దరు హీరోల డేట్స్ ని బట్టి ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

వారి లో ముందు పేరు షాహిద్ కపూర్ అని అంటున్నారు, రెండో పేరు రణవీర్ సింగ్ అని అంటున్నారు, షాహిద్ కపూర్ ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్ తో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కొట్టగా ఇప్పుడు జెర్సీ రీమేక్ తో రాబోతున్నాడు, అది త్వరలోనే పూర్తీ అయ్యే చాన్స్ ఉండటం తో ఈ సినిమా చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు.

ఇక రణవీర్ సింగ్ ఇప్పుడు కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్ నేపధ్యంలో సినిమా చేస్తున్నాడు, తర్వాత మరో సినిమా కమిట్ అయ్యాడు, ఇప్పటికే టెంపర్ రీమేక్ తో అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాంతో ఈ హీరో కూడా రేసులో ముందు నిలిచాడు అని చెప్పాలి. ఇద్దరు హీరోలకి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సో ఎవరు రీమేక్ చేసినా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. మరి ఫైనల్ గా ఎవరు కన్ఫాం అవుతారో చూడాలి.

Leave a Comment