న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురంలో 2 డేస్ టోటల్ కలెక్షన్స్…డే 2..సెన్సేషనల్ రికార్డ్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించగా సినిమా ఇప్పుడు రెండో రోజు అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగానికి పైగా రికవరీ ని చేసి సంచలనం సృష్టించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టవచ్చు అని అంచనా వేయగా అంచనాలను అందుకున్న సినిమా 10.25 కోట్లతో రెండో రోజు టాలీవుడ్ లో నాన్ బాహుబలి మూవీస్ లో సాహో తర్వాత రెండో ప్లేస్ లో నిలిచే కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 4.02Cr
👉Ceeded: 1.45Cr
👉UA: 1.67Cr
👉East: 0.65Cr
👉West: 0.49Cr
👉Guntur: 0.80Cr
👉Krishna: 0.87Cr
👉Nellore: 0.30Cr
AP-TG Total:- 10.25CR
ఇదీ రెండో రోజు సినిమా కలెక్షన్స్ ఊచకోత.

ఇక 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 10.03Cr
👉Ceeded: 5.47Cr
👉UA: 4.54Cr
👉East: 3.63Cr
👉West: 3.27Cr
👉Guntur: 4.21Cr
👉Krishna: 3.44Cr
👉Nellore: 1.59Cr
AP-TG Total:- 36.18CR💥💥
Ka: 3.78Cr
ROI: 1.43Cr
OS: 7.36Cr
Total: 48.73Cr(75Cr~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సగానికి పైగా రికవరీ చేయగా మిగిలిన రన్ లో మరో 36.27 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది. సినిమా ఊపు చూస్తుంటే ఈ వీక్ పూర్తీ అయ్యే లోపు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక 3 వ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!
x