టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

అసలు ఎవరికీ తెలియని సినిమా సెన్సేషనల్ టోటల్ కలెక్షన్స్!

బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని శాకిస్తూ ఉంటాయి… అసలు ఎవరూ పట్టించుకోకుండా రిలీజ్ అయిన సినిమాలు ఆడియన్స్ థియేటర్స్ లో సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే కచ్చితంగా థియేటర్స్ లో ఆ సినిమాను చూస్తారు. రీసెంట్ గా సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా నరసింహా పురం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తక్కువ టైం లోనే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇతర సినిమాల కన్నా కూడా బెటర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ను సాధించింది. కానీ సినిమా ఓవరాల్ గా నిర్మాతలు ఓన్ రిలీజ్ చేయడం తో బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ను చెప్పలేని పరిస్థితి ఏర్పడింది…

టీవీ సీరియల్స్ నటుడు నంద కిషోర్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా సెకెండ్ పాండమిక్ తర్వాత థియేటర్స్ లో అడుగు పెట్టిన మొదటి సినిమాల్లో ఒకటిగా నిలవగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లోనే 22 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 41 లక్షల దాకా గ్రాస్ ని సొంతం చేసుకుంది… అంటే మొదటి వీకెండ్ తర్వాత ఆల్ మోస్ట్ సినిమా కలెక్షన్స్ డబుల్ రేంజ్ లో ఉండగా అందులో మొత్తం మీద షేర్ 24 లక్షల దాకా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాను మొత్తం మీద 120 వరకు థియేటర్స్ లో…

రిలీజ్ చేయగా బిజినెస్ ఏమి లేకుండా థార్డ్ పార్టీ బయర్స్ సహాయంతో రిలీజ్ చేశారు. కానీ ట్రేడ్ లో సినిమా బిజినెస్ వాల్యూ 40 లక్షల దాకా వాల్యూ ఉంటుందని అంటున్నారు.. ఆ లెక్కన కొంచం నిరాశ అనిపించినా ఒక పక్క భారీ ప్రమోషన్స్ చేసిన ఇష్క్ సినిమా చేతులు ఎత్తేసిన వేల ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమా ఇన్ని కలెక్షన్స్ ని సాధించడం విశేషం…

Leave a Comment