గాసిప్స్ న్యూస్

అసలే 2 ఫ్లాఫ్స్ పడ్డాయి…అయినా నితిన్ ఏంటి ఈ నిర్ణయం తీసుకున్నాడు!

యూత్ స్టార్ నితిన్ బాక్స్ అఫీస్ దగ్గర మళ్ళీ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో 2020 ఇయర్ లో భీష్మ సినిమా తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని కంబ్యాక్ ఇచ్చిన నితిన్ తర్వాత వరుస పెట్టి సినిమాలను కమిట్ అవ్వడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా చేసిన చెక్ సినిమా అలాగే భీష్మ రిలీజ్ టైం కే సగానికి పైగా చేసిన…

రంగ్ దే సినిమాలు రెండూ కూడా రీసెంట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఆడియన్స్ ముందుకు రాగా రెండూ కూడా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయాయి. రంగ్ దే మంచి టాక్ తో కూడా కలెక్షన్స్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలను గట్టిగానే సొంతం చేసుకుంది.

దాంతో బాక్ టు బాక్ 2 ఫ్లాఫ్స్ నితిన్ ఖాతాలో పడగా ఇప్పుడు ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇప్పుడు ఆశలన్నీ అంధధూన్ రీమేక్ మేస్ట్రో మీదే పెట్టుకున్న నితిన్ ఆ సినిమా పరంగా కూడా ఎక్స్ పెరిమెంటే చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఇక ఆ సినిమా తర్వాత…

పవర్ పేట సినిమా చేయాల్సింది కానీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టగా ఇప్పుడు నితిన్ యాత్ర మూవీ డైరెక్టర్ మహి వి రాఘవ్ చెప్పిన మరో డిఫెరెంట్ జానర్ కథ ని ఓకే చేశారని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. యాత్ర మూవీ బాగున్న కమర్షియల్ గా మరీ అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. అసలే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

కమర్షియల్ కంబ్యాక్ అవసరం ఉన్న నితిన్ ఇప్పటికే అంధ ధూన్ రీమేక్ తో ప్రయోగం చేస్తుంటే తర్వాత కమర్షియల్ మూవీ చేస్తాడు అనుకుంటే మరో ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. యు వి క్రియేషన్ లో ఈ మూవీ ఉంటుందని టాక్ ఉంది. మరి ఇది ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి ఇక..

Leave a Comment