న్యూస్ రివ్యూ

ఆకాశం నీ హద్దురా ట్రైలర్ రివ్యూ….సూర్య కుమ్మేశాడు!!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న కోలివుడ్ హీరోల్లో సూర్య కూడా ఒకరు, అలాంటి సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా పేరు తో డబ్ అవ్వగా సినిమా ఈ నెల ఎండ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు నవంబర్ 12 న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది.

ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా మంచి పాజిటివ్ టాక్ తో ట్రైలర్ దూసుకు పోతుంది అని చెప్పాలి. డెక్కన్ ఎయిర్ వేస్ ఎలా మొదలైంది, హీరో 4 కోట్లు పెట్టి ప్లెయిన్ ని కొని ఒక్క రూపాయి టికెట్ తో సామాన్యులకు కూడా…

విమాన ప్రయాణం ఎలా అందుబాటులోకి తేవాలి అనుకున్నాడు, కానీ దాన్ని అడ్డుకోవాలని ఇతర ఎయిర్ కంపెనీలు ఎలా అడ్డుపడ్డాయి, అవన్నీ ఎదురుకుని హీరో ఎలా అనుకున్నది సాధించాడు అన్నది సినిమా స్టొరీ గా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. ట్రైలర్ బ్యాగ్రౌండ్ స్కోర్…

చాలా బాగా ఆకట్టుకోగా, సూర్య మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కుమ్మేసింది, సూర్య కి డబ్బింగ్ చెప్పిన సత్యదేవ్ కూడా మెప్పించినా కానీ ఇప్పటికే అనేక సార్లు సూర్య కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడంతో వాటితో పోల్చితే సత్యదేవ్ డబ్బింగ్ అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇదొక్కటి తప్పితే మిగిలినవన్నీ సినిమా ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉండగా ఇప్పుడు సినిమా ట్రైలర్…

24 గంటల్లో యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది, థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కానుండగా నవంబర్ 12 న సినిమా అమెజాన్ ప్రైమ్ లో సాలిడ్ వ్యూస్ తో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగు తమిళ్ లో ఒకేసారి ఆ రోజునే సినిమా రిలీజ్ కానుంది ఇప్పుడు.

Leave a Comment