న్యూస్

ఆగడు-బ్రూస్ లీ ఫ్లాఫ్ కి కారణం ఇదే…తప్పు తెలుసుకున్న శ్రీనువైట్ల!

టాలీవుడ్ లో కామెడీ సినిమాలతో ఓ రేంజ్ లో ఆడియన్స్ ను నవ్వించి కామెడీ కాన్సెప్ట్ ను కమర్షియల్ మూవీస్ లో ఓ రేంజ్ వాడుకుని స్టార్ డైరెక్టర్ నుండి టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిన దర్శకుడు శ్రీనువైట్ల. దూకుడు, బాద్ షా లాంటి సినిమాలతో కెరీర్ పీక్ స్టేజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేసి భారీ రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్ గా మారిన శ్రీను వైట్ల కెరీర్ లో…

తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్ సినిమాలతో ఒక్కసారిగా డీలా పడిపోయాడు. బాద్ షా తర్వాత వరుసగా ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోని లాంటి సినిమాలతో బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ తో కెరీర్ లో ఆల్ టైం లో స్టేజ్ కి వచ్చేశాడు శ్రీనువైట్ల.

ఇలాంటి టైం లో ఇప్పుడు ఢీ సినిమా కి కొంచం టచ్ ఉండేలా ఢీ 2 సినిమా చేస్తున్న శ్రీనువైట్ల రీసెంట్ గా మీడియా ఇంటర్వ్యూలో భాగంగా కెరీర్ లో ఈ డౌన్ ఫాల్ కి కారణం అయిన ఆగడు మరియు బ్రూస్ లీ ల ఫ్లాఫ్ గురించి మాట్లాడుతూ…

ఆ రెండు సినిమాల ఫ్లాఫ్ కి ప్రధాన కారణం కథని కంప్లీట్ గా పూర్తీ చేయకుండానే సెట్స్ పైకి తీసుకెళ్లడం అని చెప్పాడు… దాంతో పాటు ఇతర సినిమాలకు కంప్లీట్ స్క్రిప్ట్ పూర్తీ అయ్యాకే మొదలు పెట్టామని కానీ ఈ రెండు సినిమాల విషయం లో ఎందుకో తొందర పడాల్సి వచ్చిందని, అక్కడే సినిమాల ఫలితాలు అంచనా వేయాల్సింది కానీ అంతకుముందు ఉన్న హిట్స్ వలన…

ఎక్కడో ఓవర్ కాన్ఫిడెంట్స్ కూడా పెరిగి ఆడియన్స్ కి నచ్చుతాయిలే అన్న ఆలోచన వలన సినిమాలు అనుకున్న విధంగా తీయలేదని, అదే తప్పు తర్వాత సినిమాలకు కూడా జరిగిందని తప్పు ఒప్పుకున్నాడు, కానీ ఇప్పుడు ఢీ అండ్ ఢీ విషయం లో మాత్రం మునుపటి వైట్ల మార్క్ మూవీ చూస్తారని నమ్మకంగా చెప్పాడు శ్రీనువైట్ల.

Leave a Comment