గాసిప్స్ న్యూస్

ఆచార్య రిలీజ్ విషయంలో ట్విస్ట్….కానీ ఇలా జరుగుతుందా!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ ఆచార్య. టాలీవుడ్ డైరెక్టర్స్ లో అపజయం అంటే తెలియని డైరెక్టర్ గా పేరున్న కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అప్పటి నుండి వస్తున్నా వేవ్ లతో ఈ సినిమా రిలీజ్ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

ఎట్టకేలకు ఈ ఇయర్ వస్తుంది అనుకుంటే ఈ సినిమా రిలీజ్ కి వరుస పెట్టి అన్ని సినిమాలు అడ్డంకి గా నిలుస్తున్నాయి ఇప్పుడు. దసరా బరిలో సినిమా ను నిలపాలి అనుకున్నా ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికీ ఆ డేట్ మీదే ఉండటం తో ఆ డేట్ కి రావడం కుదరదు.

దీపావళికి వస్తాం అనుకుంటే టాలీవుడ్ లో దీపావళి పెద్ద సీజన్ గా ఏమి భావించారు. దాంతో ఇక క్రిస్టమస్ వీకెండ్ అనుకుంటే పుష్ప రెడీ గా ఉంది. దాంతో ఇక సంక్రాంతి కి రావాలి అనుకుంటే వరుస పెట్టి సినిమాలు సంక్రాంతి కి ఆల్ రెడీ రోజులతో సహా డేట్స్ ని బుక్ చేసుకున్నాయి.

దాంతో ఆచార్య ముందు ప్రస్తుతం ఏ ఆప్షన్ కూడా లేదనే చెప్పాలి. దాంతో ఇప్పుడు ఆచార్య రిలీజ్ ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తో డిపెండ్ అయ్యి ఉంది. దానికి తోడూ అతి త్వరలో థార్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు, అలా జరిగితే అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది…. దాంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు టీం.

కానీ ఒకవేళ థార్డ్ వేవ్ వచ్చి పరిస్థితులు మారిపోతే ఆల్ రెడీ షూటింగ్ అయిపోయి ఉన్న సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి అవుతుంది కాబట్టి సంక్రాంతి కి సిద్ధం చేయోచ్చు అనుకుంటున్నారట. లేదా పరిస్థితులు నార్మల్ గా ఉంటే జనవరి 24 డేట్ ను కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. దాంతో ఆచార్య రిలీజ్ డేట్ పై పెద్ద కన్ఫ్యూజన్ కొనసాగుతుంది ఇప్పుడు.

Leave a Comment