టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కలెక్షన్స్: టార్గెట్ 4 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

సాయి కుమార్ తనయుడు ఆది కి టైం అస్సలు కలిసి రావడం లేదు, కెరీర్ మొదట్లో రెండు సూపర్ హిట్లు కొట్టినా తర్వాత ఇప్పటి వరకు ఒక్క పర్వాలేదు అనిపించే సినిమా ను కూడా సొంతం చేసుకోలేక పోయాడు, అయినా వరుస పెట్టి సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా హిట్ గీత దాటడం లేదు, ఈ ఇయర్ ఇప్పటికే 2 సార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆది సాయి కుమార్.

మొదటి సారి బుర్రకథ తో రాగా ఆ సినిమా వచ్చిన వారానికే పరుగును పూర్తీ చేసుకుని డిసాస్టర్ అయ్యింది, ఇక తర్వాత వెంటనే జోడి అంటూ మరో లవ్ స్టొరీ తో వచ్చినా ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఇక బాక్స్ ఆఫీస్ రిలీజ్ డిసాస్టర్ అయింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు డైరెక్టర్ సాయి కుమార్ అడవి డైరెక్షన్ లో చేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుని ఈ ఇయర్ హాట్రిక్ డిసాస్టర్లు ఆదికి దక్కేలా చేసింది.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ను 3.3 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి భారీ డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఫైనల్ రన్ సమ్మరీ ని గమనిస్తే
👉Movie Business: 3.30Cr
👉Break Even: 4cr
👉AP TG Total Share: 0.62Cr
👉Total WW Share: 0.74cr
👉Total Gross: 1.28Cr
👉Total Loss: 2.56cr Loss from Business
👉Movie Verdict: DOUBLE DISASTER

సినిమా ఫైనల్ రన్ లో కేవలం 74 లక్షల షేర్ ని మాత్రమె వరల్డ్ వైడ్ గా సాధించి బిజినెస్ లో ఏకంగా 2.56 కోట్ల లాస్ ని దక్కించుకుని డిసాస్టర్ అయ్యింది. వరుసగా ఒక్కో సినిమా డిసాస్టర్ అవుతుండటం తో ఎలాంటి సినిమా తో కంబ్యాక్ ఇవ్వాలో తెలియక ఆది మరింత మదన పడుతున్నాడు. మరి ఫ్యూచర్ లో అయినా మంచి మూవీ తో కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!