న్యూస్ రివ్యూ

ఆరడుగుల బులెట్ రివ్యూ….ఏంటి సామి ఇది!!

ఎప్పుడో 2012 టైం లో గోపీచంద్ హీరోగా బూపతి పాండియన్ దర్శత్వంలో ఒక కథని అనుకున్నారు, కొన్ని కారణాల వలన ఆ సినిమా డైరెక్టర్ గా బి గోపాల్ ఎంటర్ అవ్వగా సినిమా లేట్ అవుతూ లేట్ అవుతూ 2016 టైం లో రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుని 2017 టైంలో రిలీజ్ కి సిద్ధం అయ్యి చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయి అప్పటిను 4 ఏళ్ళుగా ఆగిపోతూ ఆగిపోతూ ఎట్టకేలకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అయింది.

మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే లైఫ్ లో ఫ్యామిలీ అండ్ లవర్ తో హ్యాప్పీగా ఉండే హీరో ఏ పని చేయకుండా ఉంటాడు, తండ్రి ప్రకాష్ రాజ్ కి ఇది అస్సలు నచ్చకపోవడంతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. ఒకానొక టైం లో ఇంట్లో నుండి వెళ్ళిపో అంటాడు.

అదే టైం లో ఒక రౌడీ ప్రకాష్ రాజ్ తో గొడవ పడతాడు… తన తండ్రి మీదకి గొడవకి వచ్చిన విలన్ ని హీరో ఎలా ఎదిరించాడు అన్నది సినిమా కథ… ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు చెప్పండి… ఎప్పుడో 1980, 90’s టైం కథతో వచ్చిన ఈ సినిమా…

కథ పరంగా ఏమాత్రం కొత్తదనం లేకుండా ఉన్నప్పటికీ గోపీచంద్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్, హీరోయిజం సీన్స్ తో మెప్పించాడు…. తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుండగా హీరోయిన్ నయనతార రోల్ జస్ట్ ఓకే, ప్రకాష్ రాజ్ రోల్ ఏమాత్రం కొత్తదనం లేని రోల్, బ్రహ్మానందం కామెడీ అంతంతమాత్రమే ఉండగా మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఎంత రొటీన్ గా ఉందంటే కథ ఏమి లేకపోవడంతో తర్వాత వచ్చే సీన్స్ ని ఆడియన్స్ ఊహించడం ఆల్ మోస్ట్ అదే సీన్స్ తెరపై రావడంతో సరిపోతుంది. ఇక సాంగ్స్ యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉన్నా యాక్షన్ సీన్స్ కి సెట్ అయింది… డైలాగ్స్ బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి.

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బి గోపాల్ ఆ టైం నాటి కథనే ఎంచుకున్నట్లు అనిపించింది. మాస్ ఆడియన్స్ ను దృష్టి లో పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాగా తీసినా ఈ స్టొరీ తో ఎన్నో సినిమాలు ఆల్ రెడీ వచ్చాయి. కథ అనేది పట్టించుకోకుండా ఫక్తు మాస్ మూవీ చూద్దాం అని ఫిక్స్ అయ్యి…

థియేటర్స్ కి వెళితే సినిమా యావరేజ్ అనిపిస్తుంది…. గోపీచంద్ సీటిమార్ కూడా రొటీన్ మాస్ మూవీనే కాని అందులో కొంచం కోర్ కథ ఉంది. ఇక్కడ ఆ పాయింట్ తో ఎన్నో సినిమాలు చూసి ఉండటం తో కంప్లీట్ గా చాలా సాదాసీదా సినిమాగా అనిపించింది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…

Leave a Comment