న్యూస్

ఆల్ ఇండియా లో 3 వ ప్లేస్…రెండేళ్ళ రికార్డ్ బ్రేక్ ఇప్పుడు!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 7 నెలల ముందు దుమ్ము లేపగా ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రికార్డులను క్రియేట్ చేస్తూ దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది, టాలీవుడ్ లో లైక్స్ పరంగా అన్ని రికార్డులను బ్రేక్ చేసిన…

రామ రాజు ఫర్ భీమ్ ఇంట్రో టీసర్ వ్యూస్ పరంగా కూడా సాలిడ్ గా దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా టాలీవుడ్ చరిత్రలో  మొట్ట మొదటి 1.1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్ ఇండియా లో…

మొత్తం మీద ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచింది, ఈ క్రమం లో సాహో హిందీ వర్షన్ కి గాను సాధించిన 1.1 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకోగా మొదటి 2 ప్లేసులలో సర్కార్ మరియు మెర్సల్ ఉన్నాయి.

ఇక ఈ టీసర్ మరో రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది, పాన్ ఇండియా మూవీస్ లో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా పాత రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది, ఇది వరకు సాహో టీసర్ అన్ని వర్షన్ లు కలుపుకుని 1.95 మిలియన్ లైక్స్ ని సాధించగా…

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 2 మిలియన్ లైక్స్ ని అన్ని వర్షన్స్ తో కలిపి అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకు పోతున్న ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ లాంగ్ రన్ లో మరెలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Leave a Comment