న్యూస్

ఆశకి అడగట్లేదు సార్…అవసరం కోసం అడుగుతున్నాం… మెగాస్టార్ టికెట్ రేట్ల పై కామెంట్స్!

ఏప్రిల్ లో వకీల్ సాబ్ రిలీజ్ టైం లో భారీ గా పెరిగిన టికెట్ రేట్లని ఏకంగా ఓ 10-15 ఏళ్ల క్రితం ఉన్న రేట్లకి తీసుకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. 10,15,20, 30 ఇలా టికెట్ రేట్లని భారీగా తగ్గించగా తర్వాత వాటిని కొంచం కుదించి 30,50, 70 కొన్ని చోట్ల 100 వరకు పెట్టారు, దాంతో భారీ రేట్లతో నిర్మాణం అయ్యే సినిమాలకు ఈ రేట్ల వలన ఏమాత్రం గిట్టుబాటు అయ్యేలా లేక పోవడం తో…

పరిస్థితులు ఇప్పుడు అంతా నార్మల్ అయినట్లు కనిపిస్తున్నా కానీ పెద్ద సినిమాలు ఏవి కూడా డేర్ చేసి రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ అంటూ చెప్పారు కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇలాంటి టైం లో ఇండస్ట్రీ నుండి ఇప్పుడు…

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టొరీ ఈవెంట్ లో వీటి పై స్పందించారు…. ఏ విపత్తు వచ్చినా స్పందించేది ఫస్ట్ సినిమా ఇండస్ట్రీనే. అలాంటి సినీ కళాకారులు ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. దయచేసి రెండు తెలుగు ప్రభుత్వాలు సినీ పరిశ్రమ సమస్యలపై దృష్టిపెట్టి జీవో ఇవ్వాల్సిందిగా విన్నపం అంటూ చెప్పిన మెగాస్టార్…

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ రేటు 20 పర్సెంట్ మాత్రమే.దీనికి సినిమా వాళ్ళు అందరూ పచ్చగా వున్నారు అని అనుకుంటారు.కానీ ఇక్కడ కూడా చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు.రెండు తెలుగు ప్రభుత్వాలకు నేను విన్నవించ కుంటున్నాను అని చెప్పారు…దాంతో పాటు ఆశతో అడగడం లేదని అవసరం కోసం అడుగుతున్నాం అంటూ ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు మెగాస్టార్…

తన సినిమా ఆచార్య షూటింగ్ పూర్తీ అయినా ఇప్పుడున్న పరిస్థితిలో రిలీజ్ చేయాలో వద్దో తెలియట్లేదని, రెవెన్యూ వస్తుందో లేదో అన్న అనుమానం అంటూ చెప్పిన మెగాస్టార్ ఇలా ఒక ఈవెంట్ లో ఈ విషయాలను హైలెట్ చేయడం తో ప్రభుత్వాలు వీటి పై ఇప్పుడు త్వరగా స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సఫలం అయ్యి పరిస్థితులు నార్మల్ అవుతాయో లేదో చూడాలి.

Leave a Comment