న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఆ ఏరియాలో 2.5 కోట్ల హైర్స్…ఆల్ టైం టాప్ 2 తో రికార్డ్!!

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి భారీ అంచనాల నడుమ మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత సినిమా పై అంచనాలు పెరిగి పోగా సినిమా లో ఉన్న టైటిల్ సాంగ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరి పోయే లెవల్ లో వచ్చింది. మొత్తం మీద సినిమాకి…

రిలీజ్ కి ముందే బజ్ మరో లెవల్ కి వెళ్ళేలా కనిపించడం తో ఇప్పుడు బిజినెస్ తో పాటు సినిమా హైర్స్ రూపం లో భారీ రేట్లు దక్కుతున్నాయని టాక్… హైర్స్ అంటే ఒక ఏరియాని రౌండ్ ఫిగర్ కి ఎక్కువ రేటు ఇచ్చి కొంటారు. ఆ ఏరియాలో…

గవర్న్ మెంట్ పర్మీషణ్ ఇస్తే టికెట్ రేట్లు వాళ్ళ ఇష్టం… లాభం వచ్చినా నష్టం వచ్చినా కొన్న వాళ్ళకే చెల్లుతుంది, కానీ నిర్మాతలు మాత్రం ఆ వచ్చిన హైర్స్ ని సినిమా షేర్ లో కలిపి రిలీజ్ చేస్తారు. ఇక సైరా సినిమా కి ఇప్పుడే హైర్స్ హవా మొదలు అయ్యింది అని చెప్పాలి.

గుంటూరు ఏరియాలో సినిమా కి హైర్స్ రూపం లో ఏకంగా 2.50 కోట్ల హైర్స్ దక్కినట్లు సమాచారం. ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే అక్కడ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. అక్కడ టాప్ ప్లేసులలో నిలిచిన సినిమాలు ఇవి…
#Baahubali2 – 3.5 Cr
#Sahoo – 2.5 Cr
#SyeRaaNarasimhaReddy – 2.5Cr
#Agnyaathavaasi – 1.8 Cr  ఇవి అక్కడ హైయెస్ట్ హైర్స్ ని అందుకున్న సినిమాలు.

బాహుబలి తర్వాత ప్లేస్ లో ఇప్పుడు సైరా సినిమా సాహో తో సమానంగా రెండో ప్లేస్ ని అక్కడ సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా రిలీజ్ సమయానికి హైర్స్ దక్కే అవకాశం ఉండటం తో ఈ హైర్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment