గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఆ టికెట్ రేట్లు ఏంటి సామి!!…రికార్డులు బద్దలు ఖాయం!!

మెగాస్టార్ చిరంజీవి మెగా సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి సిద్ధం అవుతుంది, పట్టు మని 10 రోజులు కూడా లేవు…. సినిమా థియేటర్స్ లో భీభత్సం సృష్టించడానికి, ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగగా అద్బుతమైన రెస్పాన్స్ ఆ ఈవెంట్ కి దక్కింది. ఇక ఈవెంట్ లో రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కి గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని సెలెక్టెడ్ ప్లేసు లలో మొదలు అవ్వగా రెస్పాన్స్ అదిరి పోతుంది, ఇక సినిమా ఓవర్సీస్ లో టికెట్ రేట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్లు పెంచ బోతున్నారని సమాచారం. ఓవర్సీస్ లో సినిమా టికెట్ రేట్లు….

28$ నుండి మొదలు కాబోతున్నాయట, రీసెంట్ గా వచ్చిన సాహో కి కూడా ఇదే రేంజ్ లో టికెట్ రేట్లు ఉండేవి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్స్ లో సినిమా టికెట్ రేట్లు 120 నుండి 150 వరకు ఉండబోతున్నయట, ఇక మల్టీప్లేక్సులలో టికెట్ రేట్లు 200 నుండి మొదలు కాబోతున్నట్లు సమాచారం.

ఆల్ మోస్ట్ సాహో కి కూడా ఇదే రేంజ్ లో టికెట్ రేట్లు ఉండేవి కానీ ఇప్పుడు దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండటం తో మరింత ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. టాక్ బాగుంటే సినిమా అక్టోబర్ రెండో వారం ముగిసే వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ…

సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరు అందుకోగా సినిమా సెన్సార్ పనులకు మరి కొన్ని రోజుల్లో వెల్లబోతుందని సమాచారం. ఇక దసరా సెలవుల్లో సైరా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది ఆసక్తి కరంగా మారింది…. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!