గాసిప్స్ న్యూస్

ఆ డైరెక్టర్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్??

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రంగస్థలం సినిమా తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేయగా తర్వాత చేసిన వినయ విదేయ రామ సినిమా తో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటాడు, ఆ సినిమా తర్వాత బుల్లితెరపై కూడా సాలిడ్ టి.ఆర్.పి రేటింగ్ తో లాంగ్ రన్ లో దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బిజీ గా ఉన్న రామ్ చరణ్…

ఆల్ మోస్ట్ ఏడాదిన్నర టైం ని ఈ సినిమా కోసమే కేటాయించాడు, ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇప్పటి వరకు అయితే…

ఎవరి తో కూడా తన అప్ కమింగ్ సినిమాను అయితే కమిట్ కాలేదు, చిరు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ స్పెషల్ క్యామియో లు చేయబోతున్నాడని టాక్ ఉంది. ఇక సోలో హీరోగా చేయబోయే సినిమా రేసులో ఉన్న డైరెక్టర్స్ కొందరు ఉండగా… వాళ్ళలో సురేందర్ రెడ్డి, క్రిష్ మరియు…

వంశీ పైడిపల్లిలు ఉండగా వీళ్ళలో ఇప్పుడు వంశీ తో సినిమా ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది అన్న టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది, ఇది వరకే వంశీ తో ఎవడు సినిమా చేసిన రామ్ చరణ్ రీసెంట్ గా వంశీ చెప్పిన కొత్త కథ లైన్ నచ్చగా ఇప్పుడు ఫుల్ స్టొరీ… చెప్పాడని టాక్ ఉంది.

ఆ కథ రామ్ చరణ్ కి కూడా నచ్చిందని అంటున్నారు, కానీ ఆర్ ఆర్ ఆర్ తర్వాతే ఈ సినిమా మొదలు పెట్టె అవకాశం ఉందని టాక్ ఉంది, అలాగే ప్రస్తుతానికి ఇది తెలుగు వరకు మాత్రమె పరిమితం అయిన కథ అని రూమర్స్ ఉన్నాయి, మరి అవి ఎంతవరకు నిజం అన్నది మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది…

Leave a Comment