గాసిప్స్ న్యూస్

ఆ ప్రొడ్యూసర్ తో మూడో సినిమా…డైరెక్టర్ ఎవరంటే??

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ డిసాస్టర్ అవ్వగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్. సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే, ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉండగా సినిమా వచ్చే ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమా తర్వాత…

రామ్ చరణ్ కమిట్ అయిన సినిమాలు అయితే ప్రస్తుతానికి లేవు కానీ కథా చర్చలు అయితే గట్టిగానే జరుగుతున్నాయని తెలుస్తుంది, కాగా ఆ చర్చల నుండి బయట కి వచ్చిన వార్తల్లో ఇప్పుడు రామ్ చరణ్ మరో సారి సేం ప్రొడ్యూసర్ తో తన తర్వాత సినిమాను..

కమిట్ అయ్యాడని అంటున్నారు, ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు, రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ ప్రొడ్యూసర్ డి వి వి దానయ్య. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ను కూడా నిర్మిస్తుంది ఈయనే అన్న విషయం తెలిసిందే, కాగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తర్వాత సినిమా కూడా…

ఇప్పుడు దానయ్య నిర్మాణం లోనే ఉండబోతుందని సమాచారం, ఒకే నిర్మాతతో వరుసగా మూడో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్, ఇక ఈ సినిమా కి డైరెక్టర్ గా ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి సురేందర్ రెడ్డి కాగా మరోటి కొరటాల శివ అంటున్నారు. ఈ ఇద్దరితో రామ్ చరణ్ సినిమాలు ఉండబోతున్నాయని…

ఎప్పటి నుండో టాక్ ఉండగా ఈ ఇద్దరి లో ఒకరితో సినిమా ఆర్ ఆర్ ఆర్ ముగిసిన వెంటనే ఉండే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక మరో పక్క నిర్మాతగా రామ్ చరణ్ రీసెంట్ గా సైరా ని నిర్మించగా ఇప్పుడు చిరు కొరటాల ల సినిమా ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Comment