గాసిప్స్ న్యూస్

ఆ ఫ్లాఫ్ డైరెక్టర్ చేతికి…బ్లాక్ బస్టర్ రీమేక్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమా లతో జోరు చూపుతున్న విషయం తెలిసిందే, ఖైదీ నంబర్ 150 తో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చి సైరా కోసం 2 ఏళ్ళు కష్టపడ్డ మెగాస్టార్… ఇప్పుడు మాత్రం వరుస పెట్టి సినిమా లు చేయడానికి సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న చిరు 152… ఆచార్య సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమాలు 4 వరకు కన్ఫాం అవ్వడం ఇక్కడ విశేషం అని చెప్పు కోవచ్చు.

ముందుగా మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ ని సాహో డైరెక్టర్ సుజీత్ చేతిలో పెట్టిన మెగాస్టార్, తర్వాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా తర్వాత మరో సినిమా లు కమిట్ అయ్యాడు మెగాస్టార్. అందులో ఒకటి హరీష్ శంకర్ తో…

ఉండే అవకాశం ఎక్కువగా ఉండగా మరో సినిమా మాత్రం ఫేడ్ అవుట్ అయిన డైరెక్టర్ మెహర్ రమేష్ తో చేయబోతున్నాడు. ఈ సినిమా కథ ఎలా ఉంటుంది మెహర్ రమేష్ చిరు ని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న అంశాలు ఆసక్తిగా మారగా, చిరు సైలెంట్ గా ఒక రీమేక్ ని…

మెహర్ రమేష్ చేతిలో పెట్టి మార్పులు చేర్పులు చేయమని కోరారట. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ కుమార్ వేదాలం మూవీ, తెలుగు లో ఎన్టీఆర్ తర్వాత పవన్ ల దగ్గరకు వెళ్ళిన ఈ రీమేక్ ఆఫర్ అప్పుడు ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వచ్చి చిరు చేతిలో పడినట్లు సమాచారం.

కాగా కొన్ని మార్పులు చేర్పులతో చిరు కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఈ సినిమా ని ఇప్పుడు మెహర్ రమేష్ చేతిలో పెట్టి మార్పులు బాగుంటే ముందు చేస్తారని టాక్ ఉంది, ప్రస్తుతం మెహర్ రమేష్ అదే పనిలో ఉన్నారని అంటున్నారు. దాంతో అందరూ ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment